Showing posts with label KOLLYWOOD NEWS. Show all posts
Showing posts with label KOLLYWOOD NEWS. Show all posts

Wednesday, 3 December 2014

ప్రియుడి సినిమా చూసి ముద్దులవర్షం కురిపించిన సమంత.

                     


అందాల ముద్దుగుమ్మ సమంత తన ఫ్రెండ్ పై ముద్దుల వర్షం కురిపించింది గట్టిగా హత్తుకుంది సంతోషంగా గంతులేసింది ఇదంతా ఎందుకంటే తన ప్రియుడు సిద్దార్థ్ హీరోగా నటించిన ''కావ్య తలైవన్ '' చిత్రాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై పోయింది. ఆ సినిమా బాగా నచ్చడంతో దానికి తోడూ అందులో నటించింది తన ప్రియుడు కాబట్టి సమంత ఆనందానికి అంతే లేకుండా పోయింది. అంతేనా ఆ ఆనందకరమైన విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొంటూ ఇంత అందమైన చిత్రాన్ని తీసిన వాళ్ళకు మంచి జరగాలని వాళ్ళను దేవుడు చల్లగా చూడాలని పేర్కొంది. సమంత తన స్నేహితురాలికి ముద్దులు పెట్టింది కానీ అక్కడ ఎవరిని ఊహించు కుందో యిట్టె చెప్పెయ్యొచ్చు కదా !

రజని కాంత్ భార్య లత పై చీటింగ్ కేసు.

                                 


సూపర్ స్టార్ రజని కాంత్ భార్య లత పై చీటింగ్ కేసు నమోదైంది.  ఆ వివరాల్లోకి వెళితే ఆ మద్య వచ్చిన కొచ్చడయన్ సినిమా పంపిణి హక్కులు మాకే ఇస్తానని దానికోసం పది కోట్లు అడ్వాన్సు గా కుడా తీసుకున్నారని , కాని తమను కాదని ఆ హక్కులు ఎరోస్ సంస్తకు ఇచ్చారని యాడ్ బ్యూరో సంస్త  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.  ఈ కేసులో నిర్మాత మురళి మనోహర్ పైన , దాంతో పాటు ఈ అగ్రిమెంట్ కు గ్యారంటి ఇచ్చిన రజిని శ్రీమతి లతపైన కుడా కేసు పెట్టారు . అలాగే ఇప్పుడు లింగ సినిమా హక్కులు కుడా అదే సంస్తకు ఇచ్చారని కావాలనే ఇదంతా చేస్తున్నారని , వారు మోసానికి ఓడిగాడుతున్నరంటు కంప్లైంట్ దాకలైంది . ఈ విషయం పై దర్యాప్తు జరగనుంది .

భర్త నుండి విడిపోవడానికి రెడీ అయిన మాజీ హీరోయిన్.

                                      



ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన మాజీ హీరోయిన్ గ్లామర్ డాల్ లిజి తాజాగా తన భర్త నుండి విడిపోవడానికి రెడీ అయ్యింది. గతకొంత కాలంగా కలహాల కాపురం కావడంతో ఇంకా కలిసి ఉండలేమని విడిపోవడమే మంచిదని భావించి కోర్టు కెక్కింది ఈ భామ. సుమన్ తో 20వ శతాబ్దం ,ఆత్మ బంధువు తదితర చిత్రాల్లో నటించిన లిజి దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించింది. ఇక దర్శకుడిగా ప్రియదర్శన్ కూడా పలు విజయవంతమైన చిత్రాలను అందించాడు. ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో 1996లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. గతంలోనే ఈ ఇద్దరూ విభేధాల వల్ల విడిపోవాలని అనుకున్నప్పటికీ కమల్ హాసన్ -గౌతమి చొరవ తో ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఐతే విభేదాలు మరింత ముదరడంతో  విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు కెక్కింది లిజి .

Saturday, 29 November 2014

2000వేల థియేటర్ లలో రిలీజ్ కానున్న రజనీ "లింగా".

                     



సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బహుబాషా చిత్రం ''లింగా '' డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్ లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. రజనీ సరసన అందాల ముద్దుగుమ్మలు అనుష్క ,సోనాక్షి సిన్హా లు నటించారు. ఇక జగపతి బాబు విలన్ గా నటించారు. రజనీ తో ఇంతకుముందు ప్రాణ స్నేహితుడిగా నటించిన జగపతి ఈసారి విలన్ గా నటించాడు. కే ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది

నటి శ్రీ దివ్య పై నిర్మాతల ఫిర్యాదు.

                                   


తెలుగమ్మాయి నటి శ్రీదివ్య పై తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారట ! ఆమెపై తమిళ నిర్మాతల గిల్డ్ లో ఫిర్యాదు కూడా చేసారట . నటి శ్రీదివ్య మాకు సహకరించడం లేదని ,రెమ్యునరేషన్ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుందని ఆరోపిస్తూ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాపం శ్రీదివ్య పలు ఇబ్బందులు ఎదుర్కొంటుందట . కొంతమంది నిర్మాతల వల్ల తనకు అనవసరమైన తలనొప్పులు వస్తున్నాయని బాధ పడుతోంది . తెలుగునాట అంతగా రాణించలేక పోయిన ఈ భామ తమిళనాట మాత్రం బాగానే రానిస్తోంది. ప్రస్తుతం జీవా హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న ఈ భామ తనపై వస్తున్న రూమర్లకు స్పందిస్తూ నాపై ఫిర్యాదు చేసిన నిర్మాత గత రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నాడు తప్పితే ఇచ్చిన డేట్స్ ని వినియోగించు కోలేక పోయాడని ప్రస్తుతం నేను చాలా బిజీ గా ఉన్నానని అంటోంది.

పాపం త్రిష !

                                         



దశాబ్ద కాలంగా సౌత్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హాట్ భామ త్రిష ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు లేకా ఖాళి గా ఉంది ? ఇటివలే ఆమెకు  నిశ్చితార్థం జరుపుకుందన్న వార్త ఆమె కెరీర్ కి ఇబ్బంది కలిగిస్తోంది. ఎంగేజ్ మెంటు వార్తలో వాస్తవం లేదని ఆమె వెంటనే ప్రకటించినప్పటికీ, కోలీవుడ్ మాత్రం ఆమె మాటల్ని నమ్మడం లేదు. హఠాత్తుగా పెళ్లి చేసేసుకుంటే తమ సినిమాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆమెను బుక్ చేసుకున్న కొందరు నిర్మాతలు మెల్లగా డ్రాప్ అవుతున్నారట. ఈ నేపథ్యంలో జయ్ హీరోగా మణిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నుంచి కూడా త్రిష ను తొలగించినట్టు సమాచారం. ఆమె స్థానంలో సురభిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మరో సినిమాలో కుడా త్రిష ఉంటుందో లేదో అని అనుమానాలు కలుగుతున్నాయి . ఈ విధంగా త్రిష ఛాన్సులు ఇతర తారలకు వెళ్లిపోతున్నాయి. అది విషయం .

Friday, 28 November 2014

ఏ ఆర్ రెహ్మాన్ పై రజనీ అభిమానుల కోపం .


                     


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ పై కోపంగా ఉన్నారు. రజనీ అభిమానులు రెహ్మాన్ పై కోపంగా ఉండటం ఏమిటి అని అను కుంటున్నారా ! ఎందుకంటే రజనీ నటించిన ''లింగా '' చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . ఐతే ఇటీవల విడుదలైన ఆ చిత్ర పాటలు శ్రోతలకు విన సొంపుగా లేకపోవడంతో సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట ! ఇక రజనీ అభిమానులైతే రెహ్మాన్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు. చప్పటి ట్యూన్స్ ఇచ్చి మా హీరో పరువు తీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రజనీ -రెహ్మాన్ ల కాంబినేషన్ లో వచ్చిన ''శివాజీ '',''రోబో '' చిత్రాల ఆడియో సూపర్ హిట్ కాగా ఈ లింగ ఆడియో మాత్రం చాలా వీక్ గా ఉండటం తో రజనీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఐతే రెహ్మాన్ ట్యూన్స్ ఎప్పుడు కానీ విన్న వెంటనే సూపర్ గా అనిపించవు అవి వినగా వినగ ఆకట్టుకుంటాయి. మరి లింగా ట్యూన్స్ థియేటర్ లో ఆకట్టుకుంటాయో చూడాలి .

ఇద్దరు తమిళ హీరోల మద్య యుద్ద వాతావరణం.

                                  

                                

 ఇద్దరు తమిళ హీరోలు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ యుద్ద వాతావరణం సృష్టిస్తున్నారు. తమిళనాట నడిగర్ సంఘం అనే ఓ సంఘాన్ని నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసారు దీనికి రాధిక భర్త హీరో  శరత్ కుమార్ అధ్యక్ష్యుడి గా ఉన్నారు. ఐతే ఈ సంఘం వల్ల ఎటువంటి లాభం లేదని ,సభ్యులకు న్యాయం జరగడం లేదని హీరో విశాల్ ఆరోపించడంతో గొడవ ముదిరింది. విశాల్ మాటలను సీరియస్ గా తీసుకున్న శరత్ కుమార్ బాగానే రియాక్ట్ అయ్యారు . అసలు నడిగర్ సంఘం కు మూల ధనం లేని సమయంలో ఎంతో శ్రమకోర్చి విరాళాలు సేకరించానని అప్పుడు విశాల్ ఎక్కడున్నాడని ,పైగా సభ్యులకు ఫించన్ ఏర్పాటు చేసిందే నేనని ఘాటుగా సమాధానం చెప్పడంతో ఈ గొడవ ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేని విశాల్ నేనెవరిని విమర్శించలేదని కేవలం ఒక సభ్యుడిగా అడిగానని అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగినట్లే అని భావిస్తున్నారు.

Thursday, 27 November 2014

థమన్ కు ఖరీదైన కారు గిఫ్టు.

                           


ప్రస్తుతం సంగీత దర్శకుడిగా మంచి జోరుమీదున్న థమన్ కు  హీరో ప్రశాంత్ నుండి ఖరీదైన గిఫ్టు అందుకున్నాడు. ప్రశాంత్ హీరోగా తెరకెక్కుతున్న సాహసం అనే తమిళ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించావంటూ చిత్ర యూనిట్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో పాటు ఆయనకు పుట్టినరోజు గిఫ్టుగా రూ. 25 లక్షల విలువ చేసే టయోటా ఫార్చూనర్ కారు అందించారు. ‘సాహసం’ చిత్రానికి అరున్ రాజ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో హిట్టయిన ‘జులాయి’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని స్వయంగా ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్ సరసన తమన్నా నటిస్తోంది.

Wednesday, 26 November 2014

తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్న త్రిష .

                                                


హాట్ భామ త్రిష తనపై వస్తున్న వార్తలను ఖండిస్తోంది.తమిళ నిర్మాత ,పారిశ్రామిక వేత్త అయిన వరుణ్ మనియన్ ని పెళ్లాడ బోతున్నట్లు నిశ్చితార్దం కూడా చేసుకున్నట్లు వార్తలు రావడంతో ఖండన కు దిగింది ఈ భామ.నాకు ఎంగేజ్ మెంట్ జరగలేదని అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఒకవేళ నిజంగానే ఎంగేజ్ మెంట్ చేసుకుంటే అది నాకు మధురమైనది కాబట్టి తప్పకుండా అందరికీ ముందుగానే చెబుతానని కానీ ఎవరికీ చెప్పకుండా చేసుకోనని అంటోంది త్రిష. బాలకృష్ణ తో అరుకు లో షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో నేను చెన్నై లో నిశ్చితార్దం ఎలా చేసుకోగలనని ఎదురు ప్రశ్నిస్తోంది. పైగా నేను ఖాళీగా లేనని 2015వరకు డేట్స్ ఖాళీ లేవని బాలయ్య సినిమాతో పాటు మూడు తమిళ చిత్రాల్లో  ఒప్పుకున్నానని అంటోంది.

త్రిష పెళ్లి చేసుకోనుందా ?

                                    


 త్రిష పెళ్లి చేసుకోనుందా ? అదేమిటి ఆ మద్య మరో హీరోతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు వేరే వారితో పెళ్లి ఏమిటా అనుకుంటున్నారా ? త్రిష త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ మీడియా కోడై కుస్తుంది . ఈ హాట్ భామ ఓ నిర్మాతను పెళ్లి చేసుకోనుందని ఇప్పటికే ఆయనతో ఎంగేజ్ మెంట్ కుడా జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి .ఆ ప్రొడ్యూసర్ పేరు వరుణ్ మనియన్ . కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఉన్న ఈయన రియల్ ఎస్టేట్ రంగం లో చాలా పెద్ద బిజినెస్ మెన్ . ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్దం జరిగినట్టు కోలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి . ప్రస్తుతం త్రిష బాలకృష్ణ సరసన నటిస్తుంది . ఈ చిత్రానికి సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది .

భయపెట్టనున్న నయనతార.

                                 


సంచలన తారగా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ నయనతార ఇప్పుడు భయపెట్టడానికి రెడీ అయ్యింది ! ఆమధ్య 'శ్రీరామరాజ్యం' వంటి పౌరాణిక చిత్రంలో నటించిన నయనతార త్వరలో తమిళంలో ఓ సెమీ పిరీడ్ ఫిలింలో నటించనుంది. గోకుల్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా పేరు 'కాష్మోరా'. ఇందులో కార్తీ హీరోగా  ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్ర నేటి మోడరన్ కాలానికి చెందినది కాగా,  మరొకటి హిస్టారికల్ పాత్ర. ఈ రెండో పాత్ర సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. నయన్ తమిళంలో నటిస్తున్న తొలి పిరీడ్ సినిమా ఇది. మరి ఈ సినిమాతో నయనతారా ఎలా భయపెడ్తుందో చూడాలి !

రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన చంద్రముఖి.

                                      



ఆ మద్య సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జ్యోతిక సూర్య ను పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది . చంద్రముఖి చిత్రం తో తనదైన గుర్తింపును సంపాదించుకున్న అందాల నటి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించింది . తాను చేస్తున్న తొలి చిత్రం షూటింగ్ మొదలైంది. ఢిల్లీలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగును అధికారికంగా ప్రారంభించారు. తొలి షెడ్యూల్ ను ఢిల్లీలోనే నిర్వహించి, సెకండ్ షెడ్యూల్ కోసం తరువాత చెన్నైకి షిఫ్ట్ అవుతామని యూనిట్ సబ్యులు చెప్పారు. మలయాళంలో విజయవంతమైన 'హౌ ఓల్డ్ ఆర్ యు' చిత్రానికి ఇది తమిళ రీమేక్. హీరో సూర్య సొంత బ్యానర్ '2డి ఎంటర్ టైన్మెంట్' దీనిని నిర్మిస్తుండగా, రోషన్ ఆండ్రస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

Tuesday, 25 November 2014

మామకోసం తన టైటిల్ ని త్యాగం చేసాడు .

                     


సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా కోసం తన అల్లుడు అయిన ధనుష్ టైటిల్ ని కొట్టేసాడు. అవును ''లింగ '' అనే టైటిల్ రజనీ అల్లుడు ధనుష్ దట . ఆ టైటిల్ ని తన సినిమాకోసం రిజిస్టర్ చేయించారట ఐతే రజనీ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అని దర్శక నిర్మాతలు భావించడం వల్ల ధనుష్ ని అడిగి మరీ ఆ టైటిల్ ని పెట్టారట ! మామకోసం తన టైటిల్ ని త్యాగం చేయడానికి ధనుష్ ముందుకు రావడంతో లింగ సెట్స్ పైకి వెళ్ళింది. ఐతే ఇన్నాళ్ళ తర్వాత ఈ టైటిల్ గురించి నిన్న లింగ ఆడియో వేడుక లో అసలు విషయాన్ని బయట పెట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అనుష్క ,సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటించారు. కే ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Sunday, 23 November 2014

రోబో -2 లో రజిని నటించడం లేదా?

            


ఆ మద్య తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన రోబో చిత్రం దక్షిణాదినే కాదు ఉత్తరాదిని ఓ ఊపు ఊపింది. 2010లో వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఓ మరపురాని చిత్రంగా నిలిచింది. స్టార్‌ డైరక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమా ఎన్నో సంచలనాలు అందుకుంది. ఇప్పుడు మళ్లీ దాని సీక్వెల్‌ పై ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. శంకర్‌ దర్శకత్వంలోనే రజనీకాంత్‌ ఈ రోబో సీక్వెల్‌ లో చేయబోతున్నాడని మ్యాటర్‌ న్యూస్ బయటకు వచ్చింది . అయితే ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు శంకర్ చెప్పడంతో ఇప్పుడు హీరో వేటలో పడ్డాడట శంకర్‌. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ రోబో 2 కు చక్కగా సరిపోతాడని భావించిన శంకర్‌ ఆయన్ను సంప్రదించారట. ప్రస్తుతం పీకె సినిమాలో బిజీగా ఉన్న ఆమీర్‌ .. శంకర్‌ తో సినిమాకు ఓకే చెప్పాడట. రోబో 2 స్క్రిప్ట్‌ పనిలో ఉన్నాడట ఆమీర్‌. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది రోబో 2 సెట్స్‌ పై కి వచ్చే అవకాశాలున్నాయని ఫిలింనగర్‌ న్యూస్‌. ప్రస్తుతం శంకర్‌ ఐ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్‌ తో ఓ సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రోబో 2 ఆలస్యంగానే ప్రారంభం కానుందని సమాచారం .

నలుగురు హీరోలతో ఒక్క హీరోయిన్ రొమాన్స్?

                                


ఒక్క హీరోయిన్ ఒకేసారి నలుగురు హీరోలతో రొమాన్స్ చెయ్యడం ఏమిటా ? అని అనుకుంటున్నారా ? ఇంతకి విషయం ఏమిటంటే ఒక సినిమాలో హీరయిన్ ఒక్కరితో లేదంటే ఇద్దరితో రొమాన్స్ చేయటం మామూలే కాని ఒకే కధలో ఏకంగా నలుగురితో అదీ ఏకకాలంలో అంటే మామూలు విషయం కాదు.  మరి  ఆ చాన్స్ పొందిన హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటికైతే సస్పెన్స్ ? ఆ వివరాల్లోకి వెళితే  బాలీవుడ్ లో హిట్ అయిన స్పెషల్ 26 మూవీని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు సౌత్ లోని నాలుగు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హీరోల సెలక్షన్ అయిపోయింది. ఒక్కో బాషలో ఒక్కో హీరోను ఎంపిక చేశారు. అయితే నలుగురికి కలిపి ఒకే హీరోయిన్ ఉంటుందని రీమేక్ హక్కులు దక్కించుకున్నదర్శక నిర్మాత  త్యాగరాజన్ తెలిపాడు. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో నటించే సింగిల్ హీరోయిన్ ఎవరా...? అని చర్చ మొదలైంది. నాలుగు ఇండస్ర్టీల్లో కలిపి టాప్ ప్లేస్ లో ఉండే నటిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక హీరోలుగా తెలుగులో రవితేజ, తమిళంలో ప్రశాంత్, మళయాలంలో దిలీప్, కన్నడలో దర్శన్ లు నటిస్తున్నారు.

సూపర్ స్టార్ భారీ పారితోషికం .


                              



సౌత్ సూపర్ స్టార్ రజని కాంత్ గురించి అందరికి తెలిసిందే . ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా పారితోషికం పరంగా కూడా ఆయన ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'లింగా' చిత్రానికి రజనీ 60 కోట్లు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ సమాచారం. దీని ప్రకారం చూస్తే, కేవలం దక్షిణాదినే కాకుండా, ఇండియా మొత్తం మీదే మరే హీరో ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు. 'లింగా' సినిమా బిజినెస్ లో వాటాగా తన పారితోషికాన్ని తీసుకోనున్నాడట ! ఆ విధంగా ఈ సినిమా హక్కులను 165 కోట్లకు ఈరోస్ సంస్థ కొనేసింది. అందులో రజనీ వాటాగా 60 కోట్లు ముడుతున్నాయట. అది విషయం  !

టిప్పు సుల్తాన్ గా వస్తున్న స్టార్ హీరో.

                                                


విబిన్నమైన పాత్రలతో ఇండియాలోనే హీరో గా చరిత్ర సృష్టించిన స్టార్ హీరో కమలహాసన్. అయన  ఒ సినిమా చేస్తున్నాడంటే అందులో కచ్చితంగా కొత్తదనం వుంటుంది. పైగా, తాను ఎoచుకునే కథాంశాలు విభిన్నంగా వుంటాయి. ఈ కోవలో ఇప్పుడు ఓ చారిత్రాత్మక కథా చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ చరిత్రకు వెండితెర రూపాన్ని ఇవ్వడానికి కమల్ నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు పని మొదలైందని సమాచారం . తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీనిని భారి బడ్జెట్టుతో నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ రోల్ ను తానే పోషిస్తాడు.

Saturday, 22 November 2014

సూర్య - విక్రం ల 24....

                               


ఇటివలే వచ్చిన సికిందర్ పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఈ సారి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సూర్య . 13 బి, ఇష్క్ సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. ‘మనం’తో  ప్రేక్షకులను కట్టిపడేశాడు. దాంతోటాలీవుడ్ క్రేజీ దర్శకుల్లోజాబితాలో చేరిపోయాడు. మనం సక్సెస్ తర్వాత విక్ర‌మ్‌ తో సినిమా చేయడానికి టాలీవుడ్ బడా హీరోలు ఆసక్తి చూపారు. అయితే, విక్రమ్ మాత్రం టాలీవుడ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి కోలీవుడ్ కు  చేరాడు. అక్కడ సూర్య తో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘24’ అనే టైటిల్‌ ఫైనల్ చేశారు.  సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్ ఈ చిత్రం తెరకెక్కబోతుందని తెలిసింది. రెహ్మాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. హీరో సూర్యనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. 

Thursday, 20 November 2014

కమెడియన్ హీరో పక్కన టాప్ హీరోయిన్లు.

                          


ప్రస్తుతం తమిళం లో టాప్ కమెడియన్ గా జోరుమీదున్న సంతానం మరో వైపు హీరోగా కూడా బిజీగా ఉన్నాడు ?  ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో కామెడి సీన్లు చేసుకుంటున్న సంతానం త్వరలోనే మరో ప్రాజెక్టులో హీరోగా నటిస్తాడని కూడా కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ గా  ఈ స్టార్ కమెడియన్ కు టాప్ హీరోయిన్ల పక్కన నటించే చాన్స్ వచ్చిందట ? నయనతార, త్రిషను హీరోయిన్లుగా పెట్టి ఓ  సినిమా తీస్తామని అందులో నటించమని ఇతగాడిని అడుగుతున్నారట ?  అటు సంతానంతో నటించేందుకు ఇద్దరు హీరోయిన్లు కూడా ఓకే చెప్పారు. అయితే ఒకే సినిమాలో కాదు లెండి నయనతో ఒక మూవీ, త్రిషతో మరో ప్రాజెక్టులో కామెడి కింగ్ కన్పించనున్నాడు. కోలీవుడ్ లొ హీరోల కంటే బిజీగా ఉండే కమెడియన్ సంతానం. ఆయన కాల్షీట్ల కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తుంటారు. దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందాడు. తమిళంలోనే హీరోగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు, అవకాశం వస్తే త్వరలోనే తెలుగులో కూడ నటిస్తానని చెప్తున్నాడు.