సంచలన తారగా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ నయనతార ఇప్పుడు భయపెట్టడానికి రెడీ అయ్యింది ! ఆమధ్య 'శ్రీరామరాజ్యం' వంటి పౌరాణిక చిత్రంలో నటించిన నయనతార త్వరలో తమిళంలో ఓ సెమీ పిరీడ్ ఫిలింలో నటించనుంది. గోకుల్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా పేరు 'కాష్మోరా'. ఇందులో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్ర నేటి మోడరన్ కాలానికి చెందినది కాగా, మరొకటి హిస్టారికల్ పాత్ర. ఈ రెండో పాత్ర సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. నయన్ తమిళంలో నటిస్తున్న తొలి పిరీడ్ సినిమా ఇది. మరి ఈ సినిమాతో నయనతారా ఎలా భయపెడ్తుందో చూడాలి !
Wednesday, 26 November 2014
భయపెట్టనున్న నయనతార.

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment