
హాట్ భామ త్రిష తనపై వస్తున్న వార్తలను ఖండిస్తోంది.తమిళ నిర్మాత ,పారిశ్రామిక వేత్త అయిన వరుణ్ మనియన్ ని పెళ్లాడ బోతున్నట్లు నిశ్చితార్దం కూడా చేసుకున్నట్లు వార్తలు రావడంతో ఖండన కు దిగింది ఈ భామ.నాకు ఎంగేజ్ మెంట్ జరగలేదని అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఒకవేళ నిజంగానే ఎంగేజ్ మెంట్ చేసుకుంటే అది నాకు మధురమైనది కాబట్టి తప్పకుండా అందరికీ ముందుగానే చెబుతానని కానీ ఎవరికీ చెప్పకుండా చేసుకోనని అంటోంది త్రిష. బాలకృష్ణ తో అరుకు లో షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో నేను చెన్నై లో నిశ్చితార్దం ఎలా చేసుకోగలనని ఎదురు ప్రశ్నిస్తోంది. పైగా నేను ఖాళీగా లేనని 2015వరకు డేట్స్ ఖాళీ లేవని బాలయ్య సినిమాతో పాటు మూడు తమిళ చిత్రాల్లో ఒప్పుకున్నానని అంటోంది.
No comments:
Post a Comment