Showing posts with label TOLLYWOOD NEWS. Show all posts
Showing posts with label TOLLYWOOD NEWS. Show all posts

Saturday, 29 November 2014

మహేష్ నటనకు 35 ఏళ్లట .

                      


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగా నేటికి 35ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారట! అవును ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే ! ఎలాగంటే ....... సరిగ్గా ఇదే నవంబర్ 29 1979 లో నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడట మహేష్ అది కూడా తననాలుగేళ్ళ వయసులో ''నీడ '' అనే చిత్రంలో బాలనటుడిగా. ఆ తర్వాత కూడా బాలనటుడిగా పలు చిత్రాల్లో తండ్రి కృష్ణ తోనూ అన్నయ్య రమేష్ బాబు తోనూ కలిసి నటించారు మహేష్ బాబు. ఇక రాజకుమారుడు చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్. నటుడిగా 35ఏళ్ళు పూర్తిచేసుకున్న మహేష్ ని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కొమరం భీమ్ గా నాగార్జున .

                                  


ప్రస్తుతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే . నాగార్జున ద్విపాత్రాభినయం లో వస్తున్నా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది . ఇదిలా ఉండగా నాగార్జున కొమరం భీమ్ గా నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది . నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజన వీరుడు కొమరం భీమ్ . అయన జీవిత కథతో ఓ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం . ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నాయని తెలిసింది . ఈ పాత్రలో నాగార్జున నటిస్తారని ఫిలిం నగర్ సమాచారం .

పవన్ కి విగ్రహం పెడుతున్నారు.


                                           

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు విగ్రహం పెడుతున్నారు. తమిళనాట ఈ విగ్రహాలు ,గుడుల సంస్కృతీ ఉండగా అది తెలుగు వాకిట కూడా పాకింది. జనసేన అనే రాజకీయ పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుర్తా పైజామా తో గడ్డం తో కనిపించిన పవన్ గెటప్ తో విగ్రహాన్ని తాయారు చేయిస్తున్నారు పవన్ అభిమానులు. తాడేపల్లి గూడెం కు చెందిన సీతాల మోహన్ చందు అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని చేయిస్తున్నాడు. ఇక ఈ విగ్రహాన్ని నత్త రామేశ్వరం లోని ఇద్దరు శిల్పులు పెనుగొండ అరుణ్ ప్రసాద్ ,కరుణాకర్ లు రూపొందించారు. పవన్ విగ్రహం పూర్తయ్యిందని త్వరలోనే పవన్ కళ్యాణ్ కు చూపించి ఆయన అనుమతి తీసుకొని తాడేపల్లి గూడెం లో ఏర్పాటు చేస్తామని తెలిపారు పవన్ అభిమాని మోహన్ చందు.

పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన రేణు దేశాయ్.

                                     
                               

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ అయి అంతర్జాలం లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇక ఆ మోషన్ పోస్టర్ ని చూసిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ పేరు నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ ప్రశంసల వర్షం కురిపించింది. ఇప్పుడే మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ చూసాను చాలా బాగుంది. పర్ఫెక్ట్ పర్సన్ కి పర్ఫెక్ట్ పోస్టర్ ఇది ,దైవత్వం ఉట్టిపడేలా ఉంది ఆ పోస్టర్ అంటూ ట్వీట్ చేసి తన గుండెల్లో పవన్ పై ఉన్న ప్రేమని మరోసారి రుజువు చేసింది రేణు దేశాయ్. మరాఠీ భాషలో రేణు దేశాయ్ రూపొందించిన ''ఇష్క్ వాలా లవ్ '' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఆ చిత్రంలో పవన్ -రెను ల వారసుడు అకిరా నందన్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.

'గోపాల గోపాల '' ఫస్ట్ లుక్.

                              

తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజులనుండి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చలన చిత్ర రంగంలో క్రేజీ చిత్రంగా పేరు తెచ్చుకున్న భారీ చిత్రం ''గోపాల గోపాల '' ఫస్ట్ లుక్ ని చూసి పవన్ -వెంకీ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ''ఓ మై గాడ్ '' చిత్రానికిది రీమేక్ అన్న విషయం తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భగవంతుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తుడిగా దేవుడిపై  కేసు వేసే పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు.  విడుదలైన మోషన్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు -శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ క్రేజీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

అలా ఎలా బాగుందట .


          

ఈరోజు పది సినిమాలు రిలీజ్ కాగా వాటిలో అండర్ డాగ్ గా వచ్చిన చిత్రం ''అలా ఎలా ''. రాహుల్ ,వెన్నెల కిషోర్ ,భాను శ్రీ మెహ్ర ,ఖుషీ లు నటించిన ఈ చిత్రాన్ని అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోక్ వర్ధన్ నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది. ఐతే వరుసగా ఒకేరోజున పది చిత్రాలు రావడంతో ఒకవిధంగా ప్రేక్షకులకు పెద్ద కన్ఫ్యూజన్ ఎదురయ్యింది అని చెప్పవచ్చు. ఏ చిత్రాన్ని చూడాలో తెలియక ఇబ్బడి పడ్డప్పటికీ మొత్తానికి ఏ చిత్రం బాగుందో ఏ చిత్రం బాగోలేదో తేలిపోవడంతో ఇక యుత్ అంతా అలా ఎలా వైపు మల్లుతున్నారట . చిన్న చిత్రంగా వచ్చిన అలా ఎలా చిత్రానికి హిట్ టాక్ రావడంతో యూనిట్ సంతోషంగా ఉంది.

పటాస్ లోగో ఆవిష్కరణ .

                          
                                


నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ''పటాస్ ''. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగోని  27/11/14 సాయంత్రం రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన పటాస్ పాటలను డిసెంబర్ 7న హైదరాబాద్ లో అశేష అభిమానుల మద్య గ్రాండ్ గా విడుదల  చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు.

ఎన్టీఆర్ ని చూసి ఫ్లాట్ అయిన సమంత .

   


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూసి అందాల ముద్దుగుమ్మ సమంత పడిపోయిందట ! షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ తో వస్తున్న ఎన్టీఆర్ స్టిల్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అందరూ ఎన్టీఆర్ ని చూసి పొగుడుతుంటే  అందమైన భామ సమంత మాత్రం పడిపోయిందట . ఈ విషయాన్నీ స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది సమంత. ఓ మై గాడ్ అంటూ ముద్దుల వర్షం కురిపించింది ఎన్టీఆర్ పై . ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్లాట్ అయిన సమంత ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్ గత మూడు రోజులుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.

రఫ్ఫాడించని ''రఫ్ '' చిత్రం.


                           


లవర్ బాయ్ గా ఎన్ని రోజులు నేట్టుకోస్తాం యాక్షన్ హీరోగా మారిపోతే ఒకే ఒక సినిమాతో ఫేట్ మారుతుందని భావించిన ఆది సిక్స్ ప్యాక్ తో బరిలోకి దిగి మరీ దెబ్బ తిన్నాడు. దాదాపు 8నెలలు కస్టపడి సిక్స్ ప్యాక్ చేసి కండలు చూపించినప్పటికీ ప్రేక్షకులు మాకోద్దుర బాబూ నీ సిక్స్ ప్యాక్ అంటూ తిప్పి కొట్టారు.  ఆది హీరోగా తెరకెక్కిన ''రఫ్ '' చిత్రం రిలీజ్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నాయి కాబట్టి మా రఫ్ కూడా విజయం సాధిస్తుంది అని సెంటిమెంట్ గా భావించిన హీరోకి రఫ్ రఫ్ఫాడించక పోవడంతో ఖంగుతిన్నాడు. కథ కథనం లేకుండా సిక్స్ ప్యాక్ లు ,యాక్షన్ సీక్వెన్స్ చేస్తే ఇలాంటి రిజల్టే ఉంటుందని మరోసారి రుజువు చేసింది ఆది సినిమా .

ఫస్టాఫ్ బాగున్న యమలీల 2.

                                          



కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత మళ్ళీ దర్శకత్వం వహించిన చిత్రం ''యమలీల 2''. ప్రపంచ వ్యాప్తంగా 500కి కు పైగా థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తోంది. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చే సినిమా అనేసరికి క్లీన్ సినిమా అనే పేరు ప్రేక్షకుల్లో ఉండటంతో దానికి తోడూ రెండు దశాబ్దాల క్రితం సంచలన విజయం సాధించిన యమలీల చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలే ఏర్పడ్డాయి యమలీల 2 చిత్రంపై. దానికి తగ్గట్లుగా మొదటి భాగం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది యమలీల 2. ఇక సెకండాఫ్ బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంది. హాస్య సన్నివేశాలకు తోడుగా మంచి సంగీతం కూడా కుదరడంతో సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు.

పవన్ నామస్మరణతో దద్దరిల్లిన ఆడియో వేడుక.

                                


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామస్మరణతో శిల్పకళా వేదిక దద్దరిల్లింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ''చిన్నదాన నీకోసం ''. ఆ చిత్ర ఆడియో వేడుక 27/11/14 న  హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి కింగ్ నాగార్జున ,వివివినాయక్ ,దిల్ రాజు ,విక్రమ్ కుమార్ ,బెల్లంకొండ సురేష్ ,గుత్తా జ్వాల ,నిఖితరెడ్డి ,అనూప్ రూబెన్స్ ,విజయ్ కుమార్ కొండా ,కరుణాకరణ్,హీరో నితిన్ హీరోయిన్ మిస్తీ  తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పలువురు వక్తలు మాట్లాడుతున్న సమయంలో పవర్ స్టార్ అంటూ పవర్ స్టార్  అభిమానులు నినాదాలు ఇస్తుండటం తో తప్పనిసరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక నాగార్జున మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ,అఖిల్ అంటూ అరవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కారం అంటూ చెప్పాల్సి వచ్చింది.

మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన వర్మ.


                                               


మహేష్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ ఒక్కడు అయినప్పటికీ తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సాలిడ్ హిట్ ''పోకిరి ''. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించిన పోకిరి చిత్రాన్ని అలాగే ''బిజినెస్ మెన్ ''చిత్రాన్ని కూడా తక్కువగా అంచనా వేస్తూ ఎన్టీఆర్ ''టెంపర్ '' చిత్రంతో పోల్చితే మహేష్ రెండు చిత్రాలు ఫ్లాప్ అంటూ ట్వీట్ చేసి మహేష్ అభిమానులను హర్ట్ చేసాడు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఒక చిత్రాన్ని పొగడటానికి మరో సూపర్ హిట్ చిత్రాన్ని గుర్తుకు తెస్తారు కానీ ఇంకా రిలీజ్ కానీ చిత్రాన్ని రెండు సూపర్ హిట్ చిత్రాలను కంపేర్ చేయడమే కాకుండా అవి ఫ్లాప్ చిత్రాలని కామెంట్ చేసి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వర్మ. వర్మ ట్వీట్ తో మహేష్ అభిమానులు రాయలేని భాషలో వర్మ ని తిట్టి పోస్తున్నారు. నిత్యం వార్తల్లో ఉండే వర్మ మరో వివాదానికి శ్రీకారం చుట్టాడు. మరి ఈ దుమారం ఎప్పుడు చల్లారుతుందో చూడాలి .

ఆ డైరెక్టర్ కు హీరోయిన్స్ తో ఎఫైర్స్ .

                                     

రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా రత్నాచారి రూపొందించిన చిత్రం ''నేను నేనే రామునే ''. గతకొంత కాలంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ తో ఏ ఏ హీరోయిన్ లకు సంబంధం ఉందొ వాటిని అన్నింటిని మా సినిమాలో చూపించమని అంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు రత్నాచారి.వర్మ కు కొంతమంది హీరోయిన్ లకు సంబంధం ఉందని వాళ్ళని హీరోయిన్ లను చేయడం ఆ అవసరం తీరాక వాళ్ళని దూరం పెట్టడం వంటి ఆరోపణలు వర్మపై ఉన్న ఉన్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో వర్మ గా సాయి వెంకట్ యాదవ్ నటిస్తున్నాడు.

టెంపర్ ముందు పోకిరి ఫ్లాప్ .

                                   


ఎన్టీఆర్ తో సినిమా చేసే అర్హత నాకు లేదని చెప్పేసాడు సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాద్ రూపొందిస్తున్న ''టెంపర్ '' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూశానని ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడని జ 'గన్ 'లోంచి దూసుకు వస్తున్న బుల్లెట్ ఎన్టీఆర్ అని ,ఈ చిత్రంలో వినోదంతో పాటు పాటలు కూడా బాగున్నాయని అన్నిటికంటే ఎన్టీఆర్ నటన అసామాన్యమని పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు పూరి జగన్నాద్ ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్ లను క్రియేట్ చేసాడని కానీ అన్నింటి కంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దాడని ఇక ఈ టెంపర్ చిత్రంతో పోల్చితే పోకిరి ,బిజినెస్ మెన్ చిత్రాలు ఫ్లాప్ అని ట్వీట్ వేసాడు వర్మ. ఎన్టీఆర్ ని పొగిడింది అతడితో సినిమా చేయడానికి కాదని చెప్పిన వర్మ అనవసరంగా మహేష్ బాబు నటించిన చిత్రాలను ఈ విషయంలోకి లాగి మరో వివాదాన్ని లేవనెత్తారు.

ఎన్టీఆర్ ''టెంపర్ '' అనధికార ఫస్ట్ లుక్.

                                                 



యంగ్ టైగర్ ఎన్టీఆర్ చొక్కా విప్పాడు . తన తాజా చిత్రమైన ''టెంపర్ '' కోసం టెంపర్ చూపిస్తున్నాడు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ,మధురిమ ,ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఐతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ అన్నీ సిద్దం చేస్తున్న నేపథ్యంలో అనధికారికంగా రిలీజ్ అయ్యింది ఫస్ట్ లుక్. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ చొక్కా విప్పి హెయిర్ స్టైల్ మార్చి అదరగొడుతున్నాడు. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమత మౌతున్న ఎన్టీఆర్ కు ఈ టెంపర్ చిత్రం మంచి హిట్ అవుతుందని ఆశగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.

 'టెంపర్ '' చిత్రం ఫస్ట్ లుక్ దర్శక నిర్మాతలు విడుదల చేయకుండానే బయటకి వచ్చి ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఐతే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది ఎవరో కాదు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ. పోనీవర్మ ఈ స్టిల్ ని పూరి జగన్నాద్ ఎడిటింగ్ రూం నుండి ట్వీట్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాడని కొంత రష్ చూశానని అద్భుతంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొంది.


యమలీల 2 హిట్ అంటున్న బ్రహ్మానందం

                                    

యమలీల ఎంతటి సంచలన విజయం సాధించిందో అంతకు మించిన హిట్ యమలీల 2అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. డా. కెవి సతీష్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం యమలీల 2 విడుదలౌతున్న నేపథ్యంలో బ్రహ్మానందం చిత్ర విశేషాలను తెలియ జేసారు. గతంలో వచ్చిన యమలీల కంటే యమలీల 2 సంచలన విజయం సాధిస్తుందని ,సతీష్ అనే కొత్త హీరోను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఎంతో కష్టపడి అద్భుతంగా తీసారని ,సినిమా ఆద్యంతం ఎంటర్ టైన్మెంట్ తో రూపొందిందని ,వినోదం తో పాటు కృష్ణారెడ్డి మార్క్ సెంటిమెంట్ కూడా బాగా పండిందని ,ఇక యమధర్మ రాజుగా మోహన్ బాబు గారు నటించడం విశేషమని అన్నారు. యమలీల లో యమధర్మ రాజుగా సత్యనారాయణ నటిస్తే ఈ చిత్రంలో మోహన్ బాబు గారు యమధర్మ రాజుగా నటించాడని ,ఆయన ఇంతకుముందు యమదొంగ చిత్రంలో యముడిగా అద్భుతమైన నటన ని ప్రదర్శించాడని ,నేను చిత్రగుప్తుడి గా ఆయన కాంబినేషన్ లో నటించిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయని సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇక టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఈ చిత్రాన్ని నిర్మించారని ఖర్చుకు వెనుకడకుండా తీసిన గ్రాఫిక్స్ అందరినీ అలరిస్తాయని తప్పకుండా యమలీల 2చిత్రం ఘనవిజయం సాధిస్తుందని పేర్కొన్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.

టెంప్ట్ చేస్తున్న కాజల్.

                                           


అందగత్తె ననే టెంపర్ తో టెంప్ట్ చేస్తోంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇటీవలే గోవాలో షూటింగ్ జరుపుకున్న టెంపర్ చిత్రంలోని ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో కాజల్ చాలా హాట్ గా కనిపిస్తూ కుర్రకారు పల్స్ రేటు పెంచుతోంది. ఇక నిలబడిన స్టిల్ సెక్సీ లుక్ లో యూత్ ని  మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఇటీవలే దర్శకులు పూరి జగన్నాద్ తో కలిసి ఓ ఫోటో కి ఫోజిచ్చి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఈ భామ తాజా స్టిల్ కుర్రకారు కి పిచ్చేకించేలా ఉంది. ఎన్టీఆర్ సరసన బాద్ షా చిత్రం తర్వాత చేస్తున్న కాజల్ ఈ చిత్రంలో మరింత గ్లామరస్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. ఇటీవల చరణ్ తో చేసిన గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో కూడా చాలా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా లిప్ లాక్ లతో బాగానే రెచ్చిపోయింది కాజల్.

బండ్ల గణేష్ కోపానికి కారణం.

                                 




అగ్ర నిర్మాత బండ్ల గణేష్ కి కోపం వచ్చింది. అందుకే ఫిలిం చాంబర్ పెద్దలతో అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాడట ! ఎలాగూ తన వెనుక ఎన్టీఆర్ - పూరి జగన్నాద్ ఉన్నారు కాబట్టి ఇక తగ్గేది లేదని అంటున్నాడట . చాంబర్ పెద్దలపై అంతగా కోపం రావడానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ సంక్రాంతి కి పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని గతకొంత కాలంగా అనుకుంటున్నా సమయంలో తాజాగా శంకర్ విజువల్ వండర్ ఐ చిత్రం కూడా సంక్రాంతి కి వస్తుండటం తో బండ్ల ఆగ్రహంగా ఉన్నారట ! సంక్రాంతి రోజులలో డబ్బింగ్ చిత్రాలను రిలీజ్ చేయకూడదని ఓ నిభందన కూడా పెట్టుకున్నారు కానీ తీరా ఇప్పుడేమో డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి పూను కుంతుండటంతో ఈ కోపానికి కారణం అట .

రాధికా ఆప్టే తో బాలకృష్ణ ఇంకోసారి.

                         


నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తో హైదరాబాద్ లో ఆడి పాడుతున్నాడు. లెజెండ్ చిత్రంలో బాలయ్య సరసన రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా సత్య దేవా దర్శకత్వంలో మరోసారి జత కడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య - రాధికా ఆప్టే లపై హుషారైన పాట ని తెరకెక్కిస్తున్నారు. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా రాధికా ఆప్టే సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య పోషిస్తుండగా రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య -సంగీత దర్శకులు మణిశర్మ ల కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత బాలయ్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా చిత్ర నిర్మాణం పూర్తి అయిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రవిబాబు చిత్రం ''అవును 2'.


                            



విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు తాజాగా తన ''అవును 2'' చిత్ర లుక్ ని రిలీజ్ చేసాడు. హర్రర్ చిత్రాలు వరుసగా హిట్ కొడుతున్న నేపథ్యంలో వస్తున్న అవును 2 కూడా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అవును చిత్రం మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ ని ప్లాన్ చేసాడు రవిబాబు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ విషయానికి వస్తే .......... హీరోయిన్ పూర్ణ చీర కొంగు ని ఓ ఏనుగు లాగుతుండగా ,మరో కాలుతో కౌగిలించుకుంటూ ఉన్న స్టిల్ ని రిలీజ్ చేసారు. తీసే సినిమా ప్రతీది కూడా డిఫరెంట్ గా పబ్లిసిటీ చేయడం రవిబాబు స్టైల్. ఈ స్టిల్ తో మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు.