Friday, 28 November 2014

ఏ ఆర్ రెహ్మాన్ పై రజనీ అభిమానుల కోపం .


                     


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ పై కోపంగా ఉన్నారు. రజనీ అభిమానులు రెహ్మాన్ పై కోపంగా ఉండటం ఏమిటి అని అను కుంటున్నారా ! ఎందుకంటే రజనీ నటించిన ''లింగా '' చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . ఐతే ఇటీవల విడుదలైన ఆ చిత్ర పాటలు శ్రోతలకు విన సొంపుగా లేకపోవడంతో సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట ! ఇక రజనీ అభిమానులైతే రెహ్మాన్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు. చప్పటి ట్యూన్స్ ఇచ్చి మా హీరో పరువు తీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రజనీ -రెహ్మాన్ ల కాంబినేషన్ లో వచ్చిన ''శివాజీ '',''రోబో '' చిత్రాల ఆడియో సూపర్ హిట్ కాగా ఈ లింగ ఆడియో మాత్రం చాలా వీక్ గా ఉండటం తో రజనీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఐతే రెహ్మాన్ ట్యూన్స్ ఎప్పుడు కానీ విన్న వెంటనే సూపర్ గా అనిపించవు అవి వినగా వినగ ఆకట్టుకుంటాయి. మరి లింగా ట్యూన్స్ థియేటర్ లో ఆకట్టుకుంటాయో చూడాలి .

No comments:

Post a Comment