Wednesday, 26 November 2014

రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన చంద్రముఖి.

                                      



ఆ మద్య సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జ్యోతిక సూర్య ను పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది . చంద్రముఖి చిత్రం తో తనదైన గుర్తింపును సంపాదించుకున్న అందాల నటి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించింది . తాను చేస్తున్న తొలి చిత్రం షూటింగ్ మొదలైంది. ఢిల్లీలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగును అధికారికంగా ప్రారంభించారు. తొలి షెడ్యూల్ ను ఢిల్లీలోనే నిర్వహించి, సెకండ్ షెడ్యూల్ కోసం తరువాత చెన్నైకి షిఫ్ట్ అవుతామని యూనిట్ సబ్యులు చెప్పారు. మలయాళంలో విజయవంతమైన 'హౌ ఓల్డ్ ఆర్ యు' చిత్రానికి ఇది తమిళ రీమేక్. హీరో సూర్య సొంత బ్యానర్ '2డి ఎంటర్ టైన్మెంట్' దీనిని నిర్మిస్తుండగా, రోషన్ ఆండ్రస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

No comments:

Post a Comment