Showing posts with label BOLLYWOOD NEWS. Show all posts
Showing posts with label BOLLYWOOD NEWS. Show all posts

Wednesday, 3 December 2014

అజహరుద్దీన్ సినిమా పై ఇమ్రాన్ కామెంట్ !

                              


ఈ మద్య బాలీవుడ్ లో బయో పిక్ సినిమాల హవా ఎక్కువైంది ఈ తరహా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్ ను దక్కించుకుంటున్నాయి . ఈ నేపద్యం లో లేటెస్ట్ గా ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ జీవిత కథతో బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో అజహర్ పాత్రలో ముద్దులా వీరుడు ఇమ్రాన్ హస్మి నటిస్తున్నాడు . కునాల్ దేశముఖ్ దర్శకత్వం వహించే ఈ సినిమాను క్రేజీ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాలోని అజహర్ పాత్రపై ఇమ్రాన్ కామెంట్ చేస్తున్నాడు . దేశానికి ఎంతో క్యాతి తెచ్చిన అజహర్ జీవితాన్ని రెండు గంటల్లో చూపించడం సాహసమే అని , అయన జీవితం లో క్రికెట్ కంటే కుడా సినిమా నే ఎక్కువాగా ఉందని అయన పాత్రలో నటించడం ఆనందంగా ఉందని అంటున్నాడు . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది .

Saturday, 29 November 2014

సన్నీ లియోన్ తో నటించడానికి ఒప్పుకొని బాలీవుడ్ హీరో .

                            


పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కు వరుసగా అవమానాలు ఎదురౌతున్నాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హాష్మి సన్నీ లియోన్ తో నటించ డానికి ఒప్పుకోక పోవడంతో అవమానం ఎదురైన ఈ భామకి తాజాగా ఓ యువ హీరో సైతం ఈ ముద్దుగుమ్మ తో నటించేది లేదని ఒకటి కాదు రెండు సార్లు అవమా నించాడట ! వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజమే ! ఒకవైపు ప్రపంచమంతా రాత్రిపూట కళల రాణిగా విరాజిల్లుతున్న ఈ పోర్న్ భామతో రెండుసార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమెతో నటించడానికి ఒప్పుకొని బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ........... అక్షయ్ ఒబెరాయ్. మొదట ''లీలా '' చిత్రం కాగా తర్వాత ''బేమాన్ ఇష్'' చిత్రంలో సన్నీ తో నటించాల్సిన హీరో అడల్ట్ స్టార్ తో నటించడానికి ఒప్పుకోక పోవడం వల్ల ఆమెకి రెండుసార్లు అవమానం ఎదురయ్యింది.

సెట్లో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రియాంకా చోప్రా.


                            

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా రాత్రనక పగలనక కష్టపడటంతో కాస్త నీరసానికి గురై షూటింగ్ జరుగుతున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ''బాజీరావు మస్తానీ '' చిత్రంలో నటిస్తుంది. ఐతే ఆ సినిమా కోసం నాలుగు గంటల పాటు రిహార్సల్స్ లో పాల్గొనడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా యూనిట్ వర్గాలు షాక్ అయ్యాయట ! ప్రియాంకా కింద పడిపోవడానికి కారణం ఏంటో తెలియక కంగారు పడ్డారట . ఐతే ప్రియాంక కింద పడిపోవడానికి ఏదేదో కారణం అనుకుంటా అంటూ గుసగుసలు కూడా వినిపించాయట. కానీ అసలు కారణం ఏమిటంటే విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయం పని పై ద్యాస పెట్టడంతో పని వత్తిడి వల్ల కళ్ళు తిరిగాయని అంటున్నారు యూనిట్ వర్గాలు.

మొగుడి పాత్రలో సల్మాన్ కావాలంటోన్న టెన్నిస్ స్టార్.

                                   

తన ఆటో బయోగ్రఫీ సినిమాగా చేస్తే మాత్రం మొగుడి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుంది అని ఆశ పడుతుంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన పాత్రకు దీపికా పడుకునే అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఇక ఆ పాత్రలో మరేవరిని ఊహించుకోలేమని అలాగే నా హబ్బి గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుంది అని అంటోంది. భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఇటీవల అప్రతిహత విజయాల్ని అందుకుంటున్న సానియా తనజీవిత చరిత్ర ని రాస్తుంది.

జెనీలియా కి కొడుకు పుట్టాడు.

                             



బొమ్మరిల్లు హాసిని గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అందాల భామ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ 25/11/14 మగబిడ్డ కి జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని  హీరో రితేష్ దేశ్ ముఖ్ దృవీకరించారు. దక్షిణాదిన పలు భాషల్లో హీరోయిన్ గా నటించిన జెనీలియా కెరీర్ లో ''బొమ్మరిల్లు '' ప్రత్యేకమైనది. రితేష్ తో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించిన సమయంలో ఇద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడటంతో పెళ్ళికి దారి తీసింది. 2012లో వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కొడుకు పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసాడు రితేష్.

ఇలియానా ఆశలు నీరు కారి పోయాయి.

                                             



తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామ ఇలియానా. ఈ గోవా సుందరి తెలుగు ని పక్కన పెట్టి బాలీవుడ్ లో జెండా పాతాలని అక్కడ విచ్చల విడిగా అందాలను ఆరబోస్తూ రకరకాల జిమ్మిక్కులు ఎన్ని చేసినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు ఈ భామకి. తాజాగా సైఫ్ ఆలీఖాన్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ కి ''హ్యాపీ ఎండింగ్ '' మంచి ప్రారంభం అవుతుందని అనుకున్నప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెలవెల బోతుండటంతో ఇలియానా దిమ్మ తిరిగిందట . ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవన్నీ నీరు కారి పోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యిందని బాధ పడుతోందట .

క్యాబరే డ్యాన్సర్ గా రిచా చద్దా.

                                             


80వ దశకంలో ప్రతీ చిత్రంలో ఓ క్యాబరే సాంగ్ ని పెట్టడం ఓ ఆనవాయితీ గా వచ్చేది. ఇక ప్రేక్షకులు కూడా ఈ క్యాబరే పాటల కోసం ఎగబడే వాళ్ళు. అంతటి సమ్మోహన శక్తి క్యాబరే పాటలకు ఉండేది. కాలగమనంలో ఆ పాటలకు చెల్లు చీటీ పడగా తాజాగా బాలీవుడ్ లో క్యాబరే డ్యాన్సర్ ఇతివృత్తం నేపథ్యంలో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ భామ రిచా చద్దా ''క్యాబరే '' చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కౌస్తాబ్ నారాయణ్ నియోగి దర్శకత్వం లో ఒకప్పటి హాట్ భామ పూజా భట్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్యాబరే డ్యాన్సర్ పాత్రకు  రిచా చద్దా న్యాయం చేయగలదని భావించాను అందుకే ఆ పాత్రకు రిచా ని ఎంపిక చేసామని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు పూజా భట్.

తెరకెక్కనున్న యశ్ చోప్రా జీవిత కథ .

                                      

సినిమాలే అయన ఉపిరిగా బ్రతికారు . బాలీవుడ్ లో అయన సినిమా అంటే అందరికి ఆసక్తి , తన సినిమాల ద్వారా బాలీవుడ్ వెండితెరపై రొమాన్స్ అన్న పదానికి సరికొత్త అందమైన నిర్వచనాన్ని ఆవిష్కరించిన దివంగత యశ్ చోప్రా జీవిత కథ తెరకెక్కనుంది. 'దీవార్', 'కభీ కభీ', 'సిల్ సిలా', 'దిల్ తో పాగల్ హై' వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి పలువురు హీరోలకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన యశ్ చోప్రా అందరికీ సుపరిచితుడే. ఆయన జీవితంపై సినిమా నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు ఆయన భార్య పమేలా చోప్రా తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా చోప్రా పై సినిమా వస్తుందని ఆమె చెప్పారు. కాగా, యశ్ చోప్రాపై ఏర్పాటు చేసిన మెమోరియల్ అవార్డును ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ కు ప్రకటించారు.

Friday, 28 November 2014

రకుల్ ప్రీత్ సింగ్ కి షారుఖ్ అంటే పిచ్చి.


                                           

కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతూ కళల ఆరాధ్య దేవతగా కీర్తింప బడుతున్న రకుల్ ప్రీత్ సింగ్  మాత్రం మరొకరిని ఆరాధిస్తూ తెగ ఇదై పోతోంది. అందాల పోటీల నుండి టాలీవుడ్ బాట పట్టిన ఈ అందాల భామకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ అంటే పిచ్చి అట ! అందుకే తన అభిమాన హీరో కనిపించగానే గుడ్లప్పగీస్తూ చూస్తుండి పోయిందట. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ''సిమ్లా మిర్చి '' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న  సమయంలో షారుఖ్ ఆ సెట్ లోకి రావడంతో తన అభిమాన హీరోని అంత దగ్గరగా చూస్తుండటం తో తదేకంగా చూస్తూ ఉండిందట , ఆ తర్వాత కొద్ది సేపటికి షారుఖ్ కి రకుల్ హీరోయిన్ అని తెలియడంతో ఆమెతో దాదాపు 20 నిముషాలు మాట్లాడే సరికి అదొక వింతలా సంబరపడి పోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా ఉన్న ఈభామ మరిన్ని అవకాశాలను అంది పుచ్చుకుంటోంది.

ఇక ఇప్పుడు తెరపై రొమాన్స్.

                                 


సంచలన హాట్ గర్ల్ అనుష్క శర్మ  ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి తో నడుపుతున్న ప్రేమాయణం ,ఇప్పుడు నిజంగానే తెరపై కనిపించే అవకాశం కనిపిస్తుంది . ఈ ప్రేమజంట పై సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది ఆదిత్య చోప్రాకు. వీరితో సినిమా తీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో వారిద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు. మరోసారి వారిద్దరు కెమెరా ముందుకు రానున్నారు. అయితే, ఈసారి పూర్తి నిడివి గల చలనచిత్రంలో నటిస్తారట. ఆదిత్య చోప్రా క్రికెట్ ఇతివృత్తంగా సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో లీడ్ రోల్స్‌కు అనుష్క శర్మను, విరాట్ కోహ్లీని తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన వారిని అడిగేశారట. విరాట్ కోహ్లీకి కూడా ఆ ఆలోచన ఆసక్తి కలిగిందని అంటున్నారు. రాణీ ముఖర్జీ ఆ సినిమాను నిర్మిస్తారట. వచ్చే ఏడాది 2015 ఏప్రిల్ వరకు తనకు సమయం ఇవ్వాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పేశాడట. మరి ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీరు ఇప్పుడు తెరపై ఎలాంటి రొమాన్స్ చేస్తారో చూడాలి ?

యాంకర్ గా టెన్నిస్ భామ సానియా.

                                         



క్రేజీ స్టార్ గా టెన్నిస్ భామ సానియా మంచి క్రేజ్ తెచ్చుకుంది . అయితే సానియా హాలివుడ్ సినిమాలో నటిస్తోందని, తెరపై సానియా జీవిత గాథ  ఇలా ఆసక్తికరమైన ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు సానియా నిజంగానే తెరపై కనిపించనుంది. అదీ యాక్టర్ గా కాదు?  యాంకర్ గా ! త్వరలో సోనీ పిక్స్ ఛానల్‌లో ప్రసారం కాబోయే ‘స్కూల్ అఫ్ బాండింగ్’ కార్యక్రమానికి సానియా వ్యాఖ్యాత (యాంకర్) గా వ్యవహరించనుంది. ఈ ప్రోగ్రాంపై ఇప్పటికే టీజర్ కూడా విడుదలైంది. 60 సెకన్ల ఈ ప్రోమోలో తన నటన, ఆహార్యంతో సానియా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఎలా మొదలుపెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎలా ముగించాం అనేది ముఖ్యం అంటూ సానియా ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది చూసిన చాలామంది సానియా ప్రజెంటేషన్ అదుర్స్ అంటున్నారు. టీజర్ తో బుల్లి తెరపై సందండి చేసిన సానియా బావిష్యత్తు లో వెండితెరపై కనిపించే అవకాశాలు చాలానే ఉన్నాయి .

భారి ఫాన్సీ రేటుకు "ఐ" హిందీ హక్కులు.


                                            

 సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'ఐ' సినిమా హిందీ వెర్షన్ పంపిణీ హక్కులను AA ఫిల్మ్స్ సంస్థ చేజిక్కించుకుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ భర్త అనిల్ టాండన్ నేతృత్వంలో ఈ సంస్థ పనిచేస్తోంది. 'ఐ' సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తిలకించిన మీదట, వెంటనే 20 కోట్లకు ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు అనిల్ కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద గట్టిగా నిలబడగలిగే సత్తా ఈ చిత్రానికి ఉందన్న అభిప్రాయంతో అనిల్ దీనికి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశాడట. త్వరలోనే హిందీ వెర్షన్ ఆడియో వేడుకను గ్రాండుగా ఏర్పాటు చేసి, సినిమా ప్రమోషన్ మొదలుపెడతాడట. విక్రం , అమీ జాక్సన్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది .

63ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లాడాలని ఆశ పడుతోన్న హాట్ భామ్మ .


                             


ఇప్పటికే ఇద్దరితో జీవితాన్ని సాగించిన 63ఏళ్ల భామ జీనత్ అమన్ తాజాగా మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. 80వ దశకం లో ఓ ఊపు ఊపిన బాలీవుడ్ భామ జీనత్ అమన్ కి ఇప్పుడు 63 ఏళ్ళు. 63ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ భామ ఇన్నాళ్ళు పిల్లల కోసం ........ వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచించిన ఈ హాట్ భామ్మ ఇప్పుడు పెళ్లి చేసుకొని తన జీవితాన్ని చూసుకోవాలని ఆశ పడుతోంది. 1978-79 లో సంజయ్ ఖాన్ తో ఎఫైర్ నడిపిన ఈ భామ 1985లో మజార్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న జీనత్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడంతో నాకు కూడా ఓ దారి కావాలని ఆశ పడుతోంది.

Thursday, 27 November 2014

అమీర్ రేడియో ని ఇష్టపడుతున్న భామ .

                                  
                                             



ఇటివలే అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న పీకే సినిమాలో అమీర్ ఖాన్ అడ్డు పెట్టుకుని తీసిన ఫోటోలో ఉన్న రేడియో పై మనసు పడింది ఆ చిన్నది ? అది ఒక సాదాసీదా రేడియో, కానీ దాని పై ఆ  హీరోయిన్ మనసు పారేసుకుంది. ఈ భామ కోసం వెంట పడటానికి కుర్రకారు లైన్ కడతారు అటువంటిది ఓ రేడియో ని ఇష్టపడుతున్న ఈ భామ ఎవరో కాదు అందాల తార అనుష్క శర్మ. ప్రస్తుతం ఈమె పీకె సినిమాలో అమీర్ ఖాన్ సరసన నటించి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఇందులో అమీర్ రేడియో ని అడ్డం పెట్టుకుని పోజులు ఇచ్చిన స్టిల్ ఎంత క్రేజ్ సాధించిందో తెలిసిందే. అనుష్కకి ఈ రేడియో బాగా నచ్చి అమీర్ ని అలాగే ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ని తనకి ఇవ్వమని అడిగిందట. కానీ వీరిద్దరూ ఇచ్చేది లేదు, ఇది అంటే మాకు కూడా ఇష్టం అని, అందుకనే దీన్ని దాచి పెడతామని చెప్పినట్లు స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాజ్ కుమార్ హిరాని పోస్ట్ చేసారు. మరి ఆ రేడియో అంతగా ఆమెకు ఎందుకో నచ్చిందో అని ఆలోచనలో పడ్డారు బాలీవుడ్ జనాలు ???

కళ్ళు చెదిరేలా జరిగిన సల్మాన్ చెల్లి పెళ్లి.

                


చెల్లి కానీ చెల్లి అర్పితా ఖాన్ పెళ్లి కోసం సల్మాన్ కోట్లు గుమ్మరించాడు. దేశమంతా మారుమోగేలా ఈ పెళ్లి చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంతకీ అర్పిత ఎవరో తెలుసా ............. సల్మాన్ కి తోడబుట్టిన చెల్లి కాదు ఆమె ఓ అనాధ కేరాఫ్ ఫ్లాట్ ఫాం అయిన ఆ చిన్నారిని సల్మాన్ తండ్రి దత్తత తీసుకొని నేడు ఓ యువరాణి లా పెంచారు అంతేనా దిక్కులు పిక్కటిల్లేలా పెళ్లి చేసి తమ ఔన్నత్యాన్ని చాటారు. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి అమితాబ్ ,రజనీకాంత్ ,అమీర్ ఖాన్ ,చిరంజీవి ,నాగార్జున ,వెంకటేష్ ,కత్రినా కైఫ్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చెల్లి పెళ్లి ఘనంగ చేయడమే కాకుండా ముంబై లో 16కోట్ల విలువైన త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు సల్మాన్.

Wednesday, 26 November 2014

హ్యాపీ న్యూ ఇయర్ 2 కోసం షారుక్ గట్టిపట్టు.

                                                   



షారుక్ హీరోగా నటించి ఇటీవలే విడుదలైన చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా బాక్సాఫ్‌స్‌ను సైతం కొల్లగొట్టింది. ఇప్పటివరకు దాదాపు 400 కోట్లు వసూలు చేసిన సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇంతకీ ఆ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’. అభిషేక్‌బచ్చన్, దీపికా పదుకొనె, సోనూసూద్, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం దీపావళి కానుకగా విడుదలై విజయం సాధించింది. ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమాకు సీక్వెల్ చేయమని షారూక్ సూచించాడట. షూటింగ్ సందర్భంగా తాము బాగా ఎంజాయ్ చేసినట్టు చెబుతున్నారు చిత్ర నటీనటులు. ప్రస్తుతం ఫరాఖాన్ విదేశాల్లో ఉందని, ఆమె ఇండియాకి రాగానే సినిమా సీక్వెల్ కోసం ప్రయత్నించేలా వత్తిడి తెస్తామని షారూక్ తెలిపాడు. నాలుగువారాల్లో దాదాపు 400 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తున్న సినిమాపై బాగాలేదని కామెంట్ కూడా మరోవైపు వినిపిస్తుండటం విశేషం. ఏదైమైనా చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే గట్టిపట్టుతో ఉన్నాడు షారూక్. 

ఎక్స్‌పోజింగ్ చేయడాని కి రాలేదు.

                             



బాలీవుడ్‌లో హాట్ భామగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకాచోప్రా సిస్టర్స్ కూడా బాలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రియాంకా కజిన్ పరిణీతి చోప్రా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె మరో చెల్లి మనారా కూడా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించింది. ‘జిద్’ సినిమాలో నటిస్తున్న ఈ భామ, ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలు ప్రదర్శించిందట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సెనే్సషన్ సృష్టించాయి. భారీ ఎక్స్‌పోజింగ్‌తోపాటు ముద్దుసీన్లలో కూడా నటించి తన హవా చాటుకుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అయితే, ఈ విషయంపై మనారా స్పందిస్తూ నేను ఇక్కడికి వచ్చింది ఎక్స్‌పోజింగ్ చేయడానికో లేదా లిప్‌లాక్‌లు ఇవ్వడానికో కాదు. ఆర్టిస్టుగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని కాస్త ఘాటుగానే జవాబిచ్చింది. ఇప్పటికే సినిమా పోస్టర్లు కూడా సంచలనాలకు మారుపేరుగా నిలవడంపై మరోవైపు నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలా ఒళ్లుచూపించాలా? అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు!

దర్శకత్వం చేయనంటున్న సైఫ్ అలీఖాన్.

                      


బాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సైఫ్ ఆ మద్య కరీనా ను పెళ్లి చేసుకుని మరింత పాపులర్ అయ్యాడు . అయితే సైఫ్ మాత్రం ఆ పని మాత్రం చేయనంటున్నాడు ? ఎ పని అని అనుకోకండి ... ? అయన చేయనన్నది దర్శకత్వం ?? దర్శకత్వం చేయడం మాత్రం ఇప్పుడు తన మైండ్ లో లేదంటున్నాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. ఎందుకు? అని ప్రశ్నిస్తే, అది అంత తేలికైన పనికాదు, దర్శకత్వం కోసం చాలా కష్టపడి పని చేయాలి. సక్సెస్ అవుతామో లేదో చెప్పలేము. ఒకవేళ రేపటి రోజున నేను నటుడిని కాకుండా ఉంటే, తప్పకుండా డైరెక్షన్ లో దిగుతా. చాలా ఆసక్తికరమైన జాబ్, కానీ అంతే కష్టమైనది  అని తాజాగా తన చిత్రం 'హ్యాపీ ఎండిగ్' ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నటునిగా విభిన్న తరహా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెబుతున్నాడీ పటౌడీ వారసుడు. అందుకే థ్రిల్లర్, కామెడీ వంటివి చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు.

మహేష్ తో డేటింగ్ చేస్తానంటున్న హాట్ భామ.

                                        



ఈ మద్య బాలీవుడ్ లో డేటింగ్ లు ఎక్కువయ్యాయి . ముక్యంగా బాలీవుడ్ హీరోహీరోయిన్లకు డేటింగ్ అనేది కామన్ గా మారిపోయింది . కానీ సౌత్ సినిమాల్లో అయితే అది  షాకింగ్ న్యూసే. ఇపుడు అలాంటి న్యూస్ ఒకటి టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది . బాలీవుడ్ లోకి  దబాంగ్ తో ఎంట్రీ ఇచ్చి హాట్ భామ గా క్రేజ్ తెచ్చుకున్న సోనాక్షి సిన్హా ప్రస్తుతం రజినీకాంత్ లింగా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో కూడా విడుదలైంది. అయితే ఈ బ్యూటీని లేటెస్ట్ గా  ఓ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూ చేస్తూ సౌత్ ఇండియాలో ఒక హీరోతో డేటింగ్ చేయాలనుకుంటే  ఏ హీరోకు ఆఫర్ ఇస్తావ్ అనడిగితే ఎంతమాత్రం తడుముకోకుండా మహేష్ బాబు అనేసిందట. అంతే అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారట ? మరి ఈ మాట వింటే మహేష్ ఎలా ఫీలవుతాడో  ?

Sunday, 23 November 2014

సినిమాగా సానియా జీవిత కథ!


                                       

ఈ మద్య బాలీవుడ్ లో క్రీడాకారుల జీవిత కథలు సినిమాగా రూపుదిద్దుకొని బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.  ఇప్పటికే మిల్కాసింగ్ జీవిత గాథ ఆధారంగా ’బాగ్ మిల్కా బాగ్’, బాక్సింగ్ స్టార్ మేరికోమ్ జీవిత కథ ఆధారంగా ’మేరికోమ్’ సినిమాలు వచ్చేశాయ్. ఈ రెండు సినిమాలకు కూడా బాలీవుడ్ లో మంచి ఆధరణ లభించింది. తాజాగా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జీవిత కథ తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సానియానే వెల్లడించింది. ఇటీవలే, తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఓ దర్శకుడు తన దగ్గరు వచ్చాడని చెప్పుకొచ్చింది. అయితే, ఆ దర్శకుడికి సానియా నో చెప్పిందట. “తన జీవితం ఆధారంగా సినిమా రావడం తనకు ఇష్టం లేదని తేల్చిచెప్పింది. తన అందరిలాంటి అమ్మాయి కాను.. ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తాను అంటోంది. ఒకవేళ తన జీవిత కథ తెరపైకి వస్తే గనక దీపిక పడుకొన్ హీరోయిన్ గా నటించాలని చెప్పిందట ?