Thursday, 27 November 2014

అమీర్ రేడియో ని ఇష్టపడుతున్న భామ .

                                  
                                             



ఇటివలే అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న పీకే సినిమాలో అమీర్ ఖాన్ అడ్డు పెట్టుకుని తీసిన ఫోటోలో ఉన్న రేడియో పై మనసు పడింది ఆ చిన్నది ? అది ఒక సాదాసీదా రేడియో, కానీ దాని పై ఆ  హీరోయిన్ మనసు పారేసుకుంది. ఈ భామ కోసం వెంట పడటానికి కుర్రకారు లైన్ కడతారు అటువంటిది ఓ రేడియో ని ఇష్టపడుతున్న ఈ భామ ఎవరో కాదు అందాల తార అనుష్క శర్మ. ప్రస్తుతం ఈమె పీకె సినిమాలో అమీర్ ఖాన్ సరసన నటించి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఇందులో అమీర్ రేడియో ని అడ్డం పెట్టుకుని పోజులు ఇచ్చిన స్టిల్ ఎంత క్రేజ్ సాధించిందో తెలిసిందే. అనుష్కకి ఈ రేడియో బాగా నచ్చి అమీర్ ని అలాగే ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ని తనకి ఇవ్వమని అడిగిందట. కానీ వీరిద్దరూ ఇచ్చేది లేదు, ఇది అంటే మాకు కూడా ఇష్టం అని, అందుకనే దీన్ని దాచి పెడతామని చెప్పినట్లు స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాజ్ కుమార్ హిరాని పోస్ట్ చేసారు. మరి ఆ రేడియో అంతగా ఆమెకు ఎందుకో నచ్చిందో అని ఆలోచనలో పడ్డారు బాలీవుడ్ జనాలు ???

No comments:

Post a Comment