Saturday, 29 November 2014

తెరకెక్కనున్న యశ్ చోప్రా జీవిత కథ .

                                      

సినిమాలే అయన ఉపిరిగా బ్రతికారు . బాలీవుడ్ లో అయన సినిమా అంటే అందరికి ఆసక్తి , తన సినిమాల ద్వారా బాలీవుడ్ వెండితెరపై రొమాన్స్ అన్న పదానికి సరికొత్త అందమైన నిర్వచనాన్ని ఆవిష్కరించిన దివంగత యశ్ చోప్రా జీవిత కథ తెరకెక్కనుంది. 'దీవార్', 'కభీ కభీ', 'సిల్ సిలా', 'దిల్ తో పాగల్ హై' వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి పలువురు హీరోలకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన యశ్ చోప్రా అందరికీ సుపరిచితుడే. ఆయన జీవితంపై సినిమా నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు ఆయన భార్య పమేలా చోప్రా తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా చోప్రా పై సినిమా వస్తుందని ఆమె చెప్పారు. కాగా, యశ్ చోప్రాపై ఏర్పాటు చేసిన మెమోరియల్ అవార్డును ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ కు ప్రకటించారు.

No comments:

Post a Comment