Sunday, 23 November 2014

అక్కినేని అఖిల్ కు బాలీవుడ్ నుoడి వెల్ కమ్.

                                 



త్వరలోనే టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని అఖిల్ కు ఈ మద్య క్రేజ్ ఎక్కువయ్యింది ? బాలనటుడిగా సిసింద్రీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మనం సినిమాలో గెస్ట్ రోల్ తో వెండితెరపై కనిపించిన అఖిల్. హీరోగా ఎంట్రీకి మాత్రం చాలా టైమే తీసుకుంటున్నాడు. చేతిలో సినిమాలు లేకపోయినా ఈ బాబు కార్పోరేట్ కంపెనీలకు మాత్రం బ్రాండ్ మోడల్ గా మారిపోయాడు. వరస యాడ్స్ ను అందిపుచ్చుకుంటున్న అఖిల్ హీరో గా ఎంట్రీ ఇచ్చేది టాలీవుడ్ లోనేనా అనే డౌట్ మొదలైంది ?   ఎందుకంటే ఈ మన్మథ కుమారుడికి బాలీవుడ్ వెల్ కమ్ చెబుతోంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ అఖిల్ ను హీరోగా పరిచయం చేయటానికి ఉత్సాహంగా ఉన్నాడట. అఖిల్ చేసిన వాచ్ యాడ్ ను చూసి భట్ నాగార్జునకు ఈ ఆఫర్ ఇచ్చాడట. గతం లో నాగార్జునతో క్రిమినల్ సినిమాను ఈ దర్శకుడే రూపొందించాడు . 

No comments:

Post a Comment