Tuesday, 25 November 2014

పూణే షెడ్యూల్ కంప్లీట్ చేసిన మహేష్ .

                                   



టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు -శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈనెల 9నుండి పూణే లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహేష్ -శృతి హాసన్ ల పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకులు కొరటాల శివ. పూణే షెడ్యూల్ పూర్తిచేసుకొని హైదరాబాద్ వచ్చేసాడు మహేష్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ,జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై రవిశంకర్ ,మోహన్ , నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విదేశీ పర్యటన సతీ సమేతంగా చేసి వచ్చిన మహేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని ఈ చిత్రం చేస్తాడా లేదా అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు మహేష్.

No comments:

Post a Comment