Saturday, 29 November 2014

బాలయ్య సరసన బాలీవుడ్ భామ !

                               


బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి జోరుమీదున్న హాట్ భామ ఇప్పుడు సౌత్ లో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది ? ముక్యంగా బాలీవుడ్ భామల్ని ప్రోత్సహించడంలో బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడిదే బాటలోఈ భామకు అవకాశమివ్వ నున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బాలయ్య సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమాను  పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నటసింహ. ఆ మూవీలోనే బాలీవుడ్ భామ  సోనాక్షీని హీరోయిన్ గా తీసుకుంటాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ బడా నిర్మాత సోనాక్షిని సంప్రదించినట్టు తెలుస్తోంది. మరోవైపు సోనాక్షి కూడా సౌత్ సినిమాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మహేష్ బాబుతో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని అప్పట్లోనే ప్రకటించింది. కానీ అది ఆగిపోయింది. తాజాగా రజనీకాంత్ సరసన లింగా మూవీలో నటించింది. ఇప్పుడు బాలయ్యతో కూడా సినిమా చేసేందుకు రెడీ గానే ఉందని సమాచారం.

No comments:

Post a Comment