ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ ఇటివలే రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడెలే సినిమా తీసిన సంగతి తెలిసిందే . ఈ సినిమా తరువాత ఇప్పుడు ఎన్టిఆర్ - పూరి ల కలయికలో రూపొందుతున్న టెంపర్ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఓ సినిమా విషయం లో కాస్త వెనకడుగు వేసాడు ? ఈ వివరాలలోకి వెళితే భారీ బడ్జెట్ సినిమాలు తీయటంలో పేరు పొందిన బండ్ల గణేష్ ఈ మద్య ఓ చిన్న బడ్జెట్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. దానికోసం హీరో గా నిఖిల్ బెస్ట్ అని హీరోను సంప్రదించాడు. తన సినిమా బడ్జెట్ చెప్పటంతో పాటు , భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. నిఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు తీసుకోని విధంగా రూ.1.25కోట్లను ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడట. ఎ చిన్న హీరో ఎవరైనా ఈ ఫ్యాన్సీ అమౌంట్ కు అంగీకరిస్తారు. కానీ నిఖిల్ మాత్రం సారీ అన్నాడట!. రెమ్యునరేషన్ చూసి మరోసారి ఆలోచించుకో అని చెప్పినా సరే.. ప్లీజ్ సార్ ఇప్పుడు చేయలేను అని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. నిఖిల్ ఇలా ఎందుకు చేశాడని అనుకుంటున్నారా నిఖిల్ కు ఈ మద్య ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ రెండు హిట్ సినిమాలు పడ్డాయి. ఈ హిట్లను అందించిన డైరెక్టర్లకు చెరొక సినిమా చేసి పెడతాను అని గతంలోనే మాట ఇచ్చాడట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు కాబట్టి, ఈ ఆఫర్ తీసుకోలేను అని చెప్పేశాడట. అది విషయం.
Saturday, 29 November 2014
బండ్ల గణేష్ సినిమాను కాదన్నా నిఖిల్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment