Wednesday, 26 November 2014

'ముకుంద '' ఆడియో వేడుకకి పవన్ వస్తాడా?


                           

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కొడుకు అయిన వరుణ్ తేజ్ సినిమా ''ముకుంద '' ఆడియో వేడుకకి వస్తాడా అన్న చర్చ జరుగుతోంది. నాగబాబు తన యుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''ముకుంద '' షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకున్న ముకుంద డిసెంబర్ 14న మెగా అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ఆడియో వేడుక చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నాగబాబు. ఆ వేడుకకి మెగా హీరోలను అందరినీ ఆహ్వానిస్తున్నాడు ఐతే మెగా కుటుంబం తో గతకొంత కాలంగా అంటీ ముత్తనట్లుగా పవన్ ఉండటంతో ఈ వేడుకకి పవన్ వస్తాడా అనే చర్చ జరుగుతోంది. దానికితోడు సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం ఆడియో వేడుకకి పవన్ రాకపోవడంతో ఈ చర్చ మరింతగా సాగుతోంది. ఐతే నాగబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం పవన్ కి ఉండటం తో తప్పకుండా వస్తాడనే అంటున్నారు. పవన్ కనుక ఆ ఆడియో వేడుకకి వస్తే మెగా అభిమానుల ఆనందానికి అంతే ఉండదు.

No comments:

Post a Comment