Friday, 28 November 2014

భయపెట్టడానికి రెడీ అయిన మంచు లక్ష్మి

                                             


ఇటివలే పిలవని పేరంటం సినిమాతో భయపెట్టడానికి రెడీ అయిన మంచు లక్ష్మి ఇప్పుడు మరో సినిమాతో మరో సారి భయపెడ్తా అంటుంది . నటి, నిర్మాత మంచు లక్ష్మి మరో సినిమా ప్రారంభించింది. మంచు ఎంటర్ టైన్మెంట్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మి కథానాయికగా కూడా నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎన్.వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. అడవి శేష్, బ్రహ్మానందం, శాంతిప్రియ (భానుప్రియ చెల్లెలు) ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనిని క్రైమ్, కామెడీ కథాంశంతో రూపొందిస్తున్నారు. గీతాంజలి , ప్రేమకథ చిత్రం ల హిట్ లతో ఇప్పుడు అందరు ఇలాంటి కథాంశం తో సినిమాలు రుపొందిస్తుండడం విశేషం.

No comments:

Post a Comment