Friday, 28 November 2014

మేనల్లుడు సక్సెస్ కావడంతో హ్యాపీ గా ఉన్న పవన్.

                               



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెగ సంతోషంగా ఉన్నాడట ! తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ''పిల్లా నువ్వు లేని జీవితం'' హిట్ కావడంతో పవన్ హ్యాపీ గా ఉన్నాడు. సాయి ని ముందుగా హీరోని చెయ్యాలని ఆరాట పడింది పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కి నటనపై ఇంటరెస్ట్ ఉన్న విష యాన్నీ పసిగట్టి తన అన్నయ్యలైన మెగా బ్రదర్స్ చిరంజీవి ,నాగబాబు లకు చెప్పింది సాయి ని ఎంకరేజ్ చేసింది పవన్ కళ్యాణ్ కావడంతో అతడి సక్సెస్ పవన్ కు ఎంతో ప్రత్యేక మైనది. మొదటి చిత్రం విడుదల కాకుండా ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రెండవ సినిమా రిలీజ్ అయి సక్సెస్ కావడంతో పవన్ సంతోషంగా ఉన్నాడు. పైగా సినిమా రివ్యూ లు చదివి సాయి కి అభినందనలు తెలిపాడట పవర్ స్టార్.

No comments:

Post a Comment