Saturday, 29 November 2014

హీరో నాని చిత్రానికి మోక్షమెప్పుడో !


                                        


హీరో నాని రాజమౌళి  చిత్రంలో నటించిన తర్వాత తనకు ఇక తిరుగులేదని భావించినప్పటికి అనూహ్యంగా తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశపడ్డ నాని కి ఎదురు దెబ్బలు బాగానే తగిలాయి.వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అయిన  పైసా చిత్రం ఫ్లాప్ అవడం ,ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆహా కళ్యాణం కూడా తుస్సు మనడంతో ఒక్కసారిగా నాని కెరీర్ డైలమాలో పడింది. దాంతో తెలుగులో రిలీజ్ కావాల్సిన ''జెండాపై కపిరాజు '' చిత్రం గతకొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇదిగో -అదిగో అంటూ నెట్టుకొస్తున్నారు కానీ దానికి మాత్రం మోక్షం కలగడం లేదు. తాజాగా ఈనెలలో రిలీజ్ చేయాలనీ అనుకున్న ప్పటికీ  మరోసారి వాయిదా పడింది. ఇక ఇప్పుడేమో డిసెంబర్ అని అంటున్నారు కానీ అప్పుడు కూడా డౌటే అంటున్నారు. ఇన్నిసార్లు జెండాపై కపిరాజు జెండా ఎత్తుతుంటే ఆ సినిమాపై అంచనాలు తగ్గిపోవడం ఖాయం

No comments:

Post a Comment