Thursday, 27 November 2014

టైగర్ గా వస్తున్న సందీప్ కిషన్.


                                     


లేటెస్ట్ గా జోరు తో ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం టైగర్ గా వస్తున్నాడు . ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా సందీప్ కిషన్ హీరోగా రూపొందించనున్న సినిమా ‘టైగర్’. ఈ సినిమా కాశీలో ప్రారంభమైంది. ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రాహుల్ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీవిశ్వనాథ్ ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ గంగానది నేపథ్యంలో సాగే సినిమా ఇది. కాశీ, అలహాబాద్, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. సందీప్ కిషన్ ని హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది అన్నారు.

No comments:

Post a Comment