
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాగా ఈ చిత్రం నైజాం హక్కులను ఎన్టీఆర్ పొందినట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా ఎన్టీఆర్ చిత్రాలన్నీ పరాజయం పొందుతుండటం తో ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో చేస్తున్నారు. ఇక పూరి జగన్నాద్ కూడా ఓ భారీ హిట్ కావాలని ఉబలాట పడుతున్నాడు. హార్ట్ ఎటాక్ తో మంచి కలెక్షన్ల నే రాబట్టినప్పటికీ చెప్పుకో తగిన హిట్ కాకపోవడంతో భారీ హిట్ కోసం పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా పై అంచనాలు పెంచడానికి ఎన్టీఆర్ నైజాం హక్కులను తీసుకున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ పరంగా నైజాం పెద్ద మార్కెట్ కాబట్టి దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎన్టీఆర్.
No comments:
Post a Comment