Tuesday, 25 November 2014

చిన్నదాన నీకోసం ఆడియో వేడుక నవంబర్ 27 .


                             

యంగ్ హీరో నితిన్ -బాలీవుడ్ భామ మిస్తి జంటగా తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''చిన్నదాన నీ కోసం ''. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 27న హైదరాబాద్ లో ఘనంగా నిర్వ హించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇష్క్ ,గుండె జారి గల్లంతయ్యిందే ,హార్ట్ ఎటాక్ వంటి హిట్ చిత్రాల తర్వాత నితిన్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడూ ప్రేమ కథా చిత్రాలను చక్కగా హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో చిన్న దాన నీకోసం హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

No comments:

Post a Comment