Wednesday, 3 December 2014

భర్త నుండి విడిపోవడానికి రెడీ అయిన మాజీ హీరోయిన్.

                                      



ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన మాజీ హీరోయిన్ గ్లామర్ డాల్ లిజి తాజాగా తన భర్త నుండి విడిపోవడానికి రెడీ అయ్యింది. గతకొంత కాలంగా కలహాల కాపురం కావడంతో ఇంకా కలిసి ఉండలేమని విడిపోవడమే మంచిదని భావించి కోర్టు కెక్కింది ఈ భామ. సుమన్ తో 20వ శతాబ్దం ,ఆత్మ బంధువు తదితర చిత్రాల్లో నటించిన లిజి దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించింది. ఇక దర్శకుడిగా ప్రియదర్శన్ కూడా పలు విజయవంతమైన చిత్రాలను అందించాడు. ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో 1996లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. గతంలోనే ఈ ఇద్దరూ విభేధాల వల్ల విడిపోవాలని అనుకున్నప్పటికీ కమల్ హాసన్ -గౌతమి చొరవ తో ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఐతే విభేదాలు మరింత ముదరడంతో  విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు కెక్కింది లిజి .

No comments:

Post a Comment