హీరోయిన్ కేథరిన్ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లు అర్జున్ సరసన ''ఇద్దరమ్మాయిలతో '' చిత్రంలో నటించి తెలుగు తెరకు పరిచయం అయిన కేథరిన్ ట్రెసా సోదరుడు క్రిస్టోఫర్ బుధవారం బెంగుళూర్ లో చనిపోయాడు. క్రిస్టో ఫర్ ఆత్మహత్య చేసుకోవడంతో కేథరిన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐతే కేథరిన్ సోదరుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్ధిక సమస్యలే కారణమని తేల్చారు పోలీసులు. బెంగుళూర్ లో బికాం చేస్తున్న కేథరిన్ సోదరుడిని ఎవరూ ఆర్ధికంగా ఆదుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.సోదరుడి మృతితో కేథరిన్ శోక సముద్రంలో మునిగిపోయింది. పైసా ,ఎర్రబస్సు చిత్రాలలో నటించిన కేథరిన్ ప్రస్తుతం మరోసారి బన్నీ తో ''రుద్రమదేవి '' చిత్రంలో నటిస్తోంది.
No comments:
Post a Comment