Friday, 12 December 2014

లింగ తో హిట్ కొట్టేసిన రజనీ కాంత్






సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ''లింగ '' చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన  చిత్రానికి విదేశాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్టాఫ్ ప్రారంభంలో  రజనీ ,అనుష్క లపై మంచి రొమాంటిక్ సన్నివేశాలతో అలాగే జోష్ ఫుల్ గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరి స్తోంది. ఇక సెకండాఫ్ లో భారీ డ్యాం కట్టే సన్నివేశాలతో సాగుతుంది. మొదటి భాగంలో కనిపించే రజనీ దొంగ గా కనిపిస్తే మరో పాత్రలో రాజసం ఉట్టిపడేలా గద్వాల్ రాజుగా ,బ్రిటిష్ కలెక్టర్ గా పేద ప్రజల కోసం డ్యాం కట్టాలని తన యావదాస్థిని ధారాదత్తం చేసే ''లింగేశ్వర '' పాత్రలో రజనీ నటన అమోఘం ,అపూర్వం అంటున్నారు ప్రేక్షకులు. రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి అభిమానులను అలరిస్తున్నారు రజనీ.

No comments:

Post a Comment