మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ భారి సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించింది. దాంతో మహేష్ కొత్త సినిమాకు ‘శ్రీమంతుడు’ టైటిల్ కన్ఫర్మ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గతంలో ఈ సినిమాకు టైటిల్ ఖరారయ్యిందంటూ గతంలో పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. వాటిని దర్శకుడు ఖండించారు. తాజాగా ఈ టైటిల్ పై ఎటువంటి స్పందన వెలువడుతుందో..? వచ్చే వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment