ఈ ఏడాది చివరి నెల తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు సినీ ప్రముఖులు చనిపోవడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారితో పాటు అభిమానులు కూడా విషాద వదనంతో కనిపిస్తున్నారు.
డిసెంబర్ 6న నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ మృతితో ఆ కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ సోదరులు, అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. హరికృష్ణను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
తమ కుటుంబ పెద్ద పీజే శర్మ స్వర్గస్థులైన వార్తను సాయి కుమార్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయి కుమార్ తనయుడు ఆది వివాహం జరిగిన మరుసటి రోజున పిజే శర్మ మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది.
సోమవారం ఉదయం గుండెపోటుతో చక్రి ఆకస్మిక మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను మరింత బాధ పెట్టింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖుల మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా ఉజ్వల భవిష్యత్ కల చక్రి, జానకిరామ్ మరణం అందరిని కలచివేస్తుంది. వెళ్తూ వెళ్తూ ఈ ఏడాది టాలీవుడ్ ను విషాదంలో ముంచేసింది.
No comments:
Post a Comment