Wednesday, 3 December 2014

తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతానంటున్న రేణుదేశాయ్.

                                           


ఈ డిసెంబర్ 4నా పుట్టినరోజు ఆ సందర్భంగా నా వ్యక్తిగత జీవితానికి సంబందించిన అన్ని విషయాలను చెబుతానని......... ఆ విషయాలన్నీ యూట్యూబ్ లో చూడొ చ్చని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. నిత్యం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను షేర్ చేసుకునే రేణు దేశాయ్ మరో బాంబు పేల్చారు. తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను చెబుతాననే సరికి ఏ ఏ విషయాలను చెబుతుందో అన్న ఆసక్తి మొదలయ్యింది. వ్యక్తిగత జీవితంలో పవన్ కి సంబందించిన విషయాలను ఏమైనా చెబుతుందా అన్న చర్చ జరుగుతోంది. చూద్దాం  రేణు దేశాయ్ ఏం చెబుతుందో.?

No comments:

Post a Comment