ప్రముఖ తమిళ దర్శకుడు కె బాలచందర్ సోమవారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ విషయం తెలిసి వెంటనే బాలచందర్ శిష్యుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాస్పిటల్ కి వెళ్లి ఐసీయులోనే బాలచందర్‌ను పరామర్శించారు.
ప్రస్తుతం బాలచందర్ క్షేమంగా ఉన్నారు. నన్ను చూసి నవ్వారు. ఆయనకి ఏమీ కాదు, త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను. అని ఐసీయు నుండి వెలుపలికి వచ్చిన అనంతరం రజినీకాంత్ చెప్పారు. అలాగే వైద్యులు కూడా బాలచందర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని పత్రికా ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజుల నుండి బాలచందర్ జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం జ్వరం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది హాస్పిటల్ లో జాయిన్ చేశారు. మరో శిష్యుడు కమల్ హాసన్ అమెరికాలోని లాజ్ ఏంజెల్స్ లో ఉండడంతో ఫోన్ లో కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
No comments:
Post a Comment