సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ ఇమేజ్, ఖండాంతరాలు దాటిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆసాధ్యం అనుకున్న రికార్డులను సాధ్యం చేశాయి. రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘లింగ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలైన తొలి వారంతంలో ‘లింగ’ 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని సమాచారం. తమిళనాడులో 55 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియాలో 26 కోట్లు, విదేశాలలో 20 కోట్లు వసూలు చేసిందని టాక్. కొందరు ఈ కలెక్షన్స్ నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2500 పైచిలుకు స్క్రీన్ లలో విడుదలైన ‘లింగ’ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. విమర్శకులు సినిమా చూసి పెదవి విరిచారు. అయితే నాలుగేళ్ళ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ల ముందు బారులు తీరారు. పలు చోట్ల వారం రోజుల వరకు అడ్వాన్సు బుకింగ్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారని సమాచారం.
No comments:
Post a Comment