Sunday, 14 December 2014

జాకెట్లో ఏముందంటున్న హాట్ భామ





చోళీ కే పీచే క్యా హై అనే పాట రెండు దశాబ్దాల క్రితం ఎంత ఊపు ఊపిందో అందరికీ తెలిసిందే . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాట మళ్ళీ ఇన్నాళ్ళకు మరో రూపంలో తెలుగు సినిమాలో చుడనున్నాం . ఐతే ఈ పాట డా. రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ''గడ్డం గ్యాంగ్ '' చిత్రం కోసం ఈ ఐటెం సాంగ్ అన్నపూర్ణ స్టూడియో లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ లో అందాలను ఆరబోస్తూ నటిస్తున్న హాట్ భామ ఎవరో తెలుసా ..... ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పదేళ్ళ క్రితం కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన సాలిడ్ అందాల భామ ముమైత్ ఖాన్ . ముమైత్ ఖాన్ పై ఈ పాటని చిత్రీకరిస్తున్నారు దర్శకులు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ పాట మరి ఇప్పుడు ఎలాంటి అనుభూతిని పంచనుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే .

No comments:

Post a Comment