Sunday, 14 December 2014

బాలయ్య నాగ్ లు చేయలేనిది అబ్బాయిలు చేస్తారా





మహానటులు ఎన్టీఆర్ ,అక్కినేని కలిసి నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ''గుండమ్మకథ ''. ఆ చిత్రాన్ని వారి వారసులు బాలకృష్ణ -నాగార్జున లతో నిర్మించాలని చాలా ప్రయత్నాలే చేసారు ,బాలయ్య -నాగ్ లు కూడా కలిసి నటించడానికి ఉత్సాహం చూపించారు కూడా కానీ గుండమ్మకథ చిత్రంలో కీలాక పాత్ర అయిన ఆనాటి సూర్యకాంతం కి తగ్గట్లుగా నటించే నటి కోసం వెదికి వెదికి కుదరక ఆ సినిమాని రీమేక్ చేయాలన్న ఆలోచన నుండి విరమించుకున్నారు పలువురు దర్శక నిర్మాతలు. ఐతే ఇటీవల  ఆ మహానటుల మనవళ్ళు అయిన జూనియర్ ఎన్టీఆర్ ,నాగచైతన్య లు గుండమ్మకథ చేయనున్నారని దానికి సంబందించిన చర్చలు జరుగుతున్నా యని తెలిసింది. బాలయ్య -నాగ్ లు ఇద్దరు కలిసి చేయలేనిది అబ్బాయిలు చేస్తారా అన్న ప్రశ్న ఉదయించింది  ఐతే ప్రస్తుతం వినబడుతున్న దాని ప్రకారం గుండమ్మ కథ చిత్రం పక్కకు పోయి మలయాళంలో ఘనవిజయం సాధించిన ''బెంగుళూర్ డేస్ '' లో నటించడానికి రెడీ అవుతున్నారట. ఐతే గుండమ్మకథ చిత్రాన్ని రీమేక్ చేస్తే నందమూరి -అక్కినేని కుటుంబ వంశాభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి .

No comments:

Post a Comment