Friday, 5 December 2014

మెగా హీరోకి పోటీగా వస్తున్న నితిన్

 
 


మెగా వారసుడిగా తెరంగేట్రం చేస్తూ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్ ,అలాగే ఆ మెగా హీరోకి పోటీగా నితిన్ తన చిన్నదాన నీకోసం చిత్రాన్ని కూడా ఈనెల 25న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ముకుంద చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నప్పటికీ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వారాల ముందుకు నెట్టారు,దాంతో డిసెంబర్ 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 19న రిలీజ్ కావాల్సిన నితిన్ చిత్రం చిన్నదాన నీకోసం చిత్రాన్నితాజాగా 25న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్  సెలవులను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట . దాంతో మెగా హీరో ముకుంద కి నితిన్ తన చిన్నదాన్ని దింపుతుండటంతో తీవ్ర పోటీ ఖాయమని అంటున్నారు. ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ టాక్ ఉండటం వల్ల ఈ పోటీ నెలకొంది.

No comments:

Post a Comment