తెలుగునాట సంచలన చిత్రాలకు సంగీతం అందించి పలు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటు తో మృతి చెందారు. చక్రి మృతి తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. నిన్ననే యంగ్ హీరో ఆది తాత ,సాయి కుమార్ తండ్రి పీజే శర్మ గుండెపోటు తో చనిపోగా ఈ తెల్లవారు జామున సంగీత దర్శకులు చక్రి గుండెపోటుతో మృత్యు వాత పడ్డారు. పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన ''బాచి '' చిత్రానికి తొలిసారిగా సంగీతం అందించిన చక్రి ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు తన కెరీర్ లో పూరి జగన్నాద్ - చక్రి ల కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. పూరి దర్శకత్వం ఎంతగా ఆకట్టుకుందో ఆ సినిమాలు విజయం సాధించడానికి చక్రి అందించిన సంగీతం కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ,అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ,ఇడియట్ ,సత్యం ,దేశముదురు ,దేవదాసు ,సింహా లాంటి సూపర్ చిత్రాలకు సంగీతం అందించి అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణ తో చేసిన సింహా చిత్రానికి గాను రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ అందుకున్నారు చక్రి. చిన్న వయస్సులోనే అనితర సాధ్యమైన విజయాలను సాధించిన చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి లో 1974 జూన్ 15న జన్మించారు. చక్రి అసలు పేరు చక్రధర్ . చక్రి అకాల మృతి తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్ విషాదంలో మునిగింది.
Sunday, 14 December 2014
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment