
టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రానికి సినిమా ప్రారంభం కాకముందు నుండే రకరకాల పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ వాటిలో ఏ ఒక్క దాన్ని కూడా ఓకె చేయలేదు కానీ తాజాగా వినిపిస్తున్న పేరు ''షంషేర్ ''. పూరి జగన్నాద్ చిత్రాలకు విచిత్రమైన టైటిల్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ టైటిల్ ఇంకా కన్ఫార్మ్ చేయనందున ఫస్ట్ లుక్ వాయిదా పడింది కానీ తాజా సమాచారం ప్రకారం ''షంషేర్ '' అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా షంషేర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు
No comments:
Post a Comment