
నేను చెప్పని విషయాలను చెప్పినట్లుగా ఓ పేపరులో ప్రచురించి నా ప్రతిష్ట కి భంగం కలిగించిన ఆ జర్నలిస్ట్ ని ఆ పేపర్ ని వదిలేది లేదని వాళ్ళపై కేసు వేస్తానని అంటోంది శ్వేతాబసు ప్రసాద్. వ్యభిచారం ఆరోపణలపై రెండు నెలల పాటు రెస్క్యూ హోం లో శిక్ష అనుభవించి శుక్రవారం విడుదలై ముంబై చేరుకున్న శ్వేతా మీడియాతో మాట్లాడుతూ తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కింది. రెస్క్యూ హోం లో కనీసం తన తల్లిని సైతం కలవలేదని, అటువంటప్పుడు నేను ఆ జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఎలా ఇస్తానని ,నేను చెప్పకుండానే నేను చెప్పినట్లుగా వార్తలు రాసిన వాళ్ళని వదిలేది లేదని అంటోంది. ఇక ఆ రోజు కేవలం అవార్డుల ఫంక్షన్ కోసం వెళ్ళగా ఆ హోటల్ లో నాకు బస ఏర్పాటు చేసారని కానీ సడెన్ గా పోలీసులు వచ్చి టాలీవుడ్ లో ఇంకా వ్యభిచారం చేస్తున్న తారలు ఎవరని నన్ను వేధించారని నాకు తెలియనప్పుడు నేనెందుకు చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్వేత బసు ప్రసాద్.
No comments:
Post a Comment