Monday, 3 November 2014

త్రిశూలం ని పట్టనున్న అల్లు అర్జున్.






రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం త్రివిక్రమ్ సినిమా. జులాయి వంటి సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రానికి ''త్రిశూలం '' అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నారట ఆ చిత్ర బృందం. బన్నీ సరసన ఈ చిత్రంలో సమంత,నిత్యా మీనన్ ,ఆదా శర్మ లు నటిస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో కథకు అనుగుణంగానే టైటిల్ ని పెడతాడని భావిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment