
నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడి తెరంగేట్రానికి ఇప్పటి నుండే
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ
కి నిర్మాత గా సాయి కొర్రపాటి అనే విషయం తెలిసిందే. బాలయ్య కి సాయి
సన్నిహితుడు కావడంతో ,దానికి తోడూ సాయి కి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్
ఎస్ రాజమౌళి కు సన్నిహితుడు కావడంతో మోక్షజ్ఞ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం
వహిస్తాడు అని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బాలయ్య అబిమానులకు పండగే
పండగ. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మరో సంవత్సరం పైనే పడుతుంది.
ప్రస్తుతం జక్కన్న బాహుబలి పై తన ద్రుష్టి పెడుతున్నాడు. సాయి ,రాజమౌళి
ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో మోక్షజ్ఞ చిత్రానికి ఈ కాంబినేషన్
సెట్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.
No comments:
Post a Comment