Monday, 3 November 2014

అభిమానిని చూసి చలించిన శృతి హాసన్.


                               

 


సీతల్ పవర్(17) అనే అమ్మాయి కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చావుకి దగ్గరైన సమయంలో ఆమె దైన్య స్థితి ని చూసి చలించిపోయిన శృతి,  సీతల్ ని దగ్గరకు తీసుకొని ఓదార్చి అక్కున చేర్చుకుంది. పూనే లోని సీతల్ పవర్ కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది ఐతే డాక్టర్లు ఆమెని బ్రతికించడానికి అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఆ స్టేజ్ దాటిపోవడంతో ఇక లాభం లేదని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూడండి అని తేల్చి చెప్పడంతో నాకు శృతి హాసన్ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో ''మేక్ ఎ విష్ '' సంస్థ నిర్వాహకులు శృతి ని సంప్రదించగా ఆ వార్త విన్న వెంటనే చలించి పోయి సీతల్ దగ్గరకు వెళ్లి ఆమెని దగ్గరకు తీసుకొని ఓదార్చి ధైర్యాన్ని చెప్పింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖమ్మం లోని చిన్నారిని పలకరించి వైద్య సహాయం కోసం 2లక్షల రూపాయలను ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్న విషయం తెలిసిందే .

No comments:

Post a Comment