కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'మాస్'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం నుంచి 'మాస్' షూటింగ్ హైదరబాదులో జరుగుతోంది. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇటీవల రిలీజైన 'మాస్' ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్టయిల్ లో ఉన్న సూర్య లుక్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. 2015 సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల కానుంది .
No comments:
Post a Comment