
పూరి జగన్నాద్ శిష్యుడు ఫణి అనేవ్యక్తి తన పట్ల అసభ్యంగా
ప్రవర్తిస్తున్నాడని ,నిత్యం వేధిస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని
బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హీరోయిన్ సోనాలి. ఫణి ''24/ లవ్''
వర్మ కైనా ఒబామా కైనా అనేది ఉప శీర్షికతో రూపొందుతున్న చిత్రానికి
దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంలో చందు హీరో కాగా సోనాలి హీరోయిన్ గా
నటిస్తోంది. సోనాలి హీరోయిన్ కావడంతో ఆమె పట్ల గతకొంత కాలంగా అసభ్యంగా
ప్రవర్తిస్తుండటం తో ఇక ఓపిక పట్టలేని పరిస్థితి రావడంతో బంజారాహిల్స్
పోలీసులను ఆశ్రయించింది సోనాలి. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
No comments:
Post a Comment