Tuesday, 4 November 2014

దాసరి నారాయణ రావు నేరం.

                                



ఏమిటి దాసరి నారాయణ రావు నేరం చేస్తాడా ? అదేమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే  ప్రస్తుతం దాసరి నారాయణ రావు ఎర్రబస్సు సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా తరువాత అయన మరో సినిమాకు సన్నాహాలు ప్రారంబించాడు . గత ఏడాది తమిళంలో విడుదలై న  నేరమ్ అనే చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాదించింది. అయితే ఈ సినిమా హక్కులను దాసరి తీసుకున్నాడు. తీసుకోని కూడా చాల రోజులు అవుతుంది ముందుగా ఈ చిత్రాన్ని తన కుమారుడితో రీమేక్ చేస్తానని గతంలో చెప్పారు. కానీ ఎందుకో ఇంతవరకు ఆ చిత్రం కార్య రూపం దాల్చలేదు. తాజాగా ఎర్ర బస్ చిత్రం తో మళ్లీ తన దర్శకత్వన్నికి పదును పెట్టిన దాసరి, త్వరలోనే ‘నేరమ్’ సినిమాను తెరకేక్కిస్తారని అంటున్నారు . అయితే ఈ సినిమాను విష్ణు, తన కుమారుడి కాంబినేషన్ లో కానీ, లేదా విష్ణు-మనోజ్ కాంబినేషన్ లో కానీ ఆ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట.

No comments:

Post a Comment