Tuesday, 4 November 2014

అమీర్ ఖాన్ పై ఆ కేసు .


                                



ప్రముఖ స్టార్ హీరో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అమీర్ ఖాన్ పై కోర్ట్ లో కేసు నమోదైంది ? అది కుడా  స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశం కావడం తో  న్యాయపరమైన ఇబ్బందుల్లో పడ్డాడు. అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో స్వలింగ సంపర్కాన్ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఆయనకు కోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి. చండీగర్ కోర్టు నుండి అమీర్ ఖాన్‌కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 19లోగా వివరణ ఇవ్వాలని కోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. అమీర్ ఖాన్ తన టీవీ కార్యక్రమంలో హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు కావడంతో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. న్యాయవాది మాన్‍‌దీప్ కౌర్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. సివిల్ కోర్టు జడ్జి జస్విందర్ సింగ్ శుక్రవారం అక్టోబర్ 31న ఈ నోటీసులు జారీ చేసారు. హోమో సెక్సువాలిటీ మీద సుప్రీం కోర్టు ఆధేశాలను ధిక్కరించే విధంగా అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఉందని కౌర్ ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు వెంటనే జోక్యం చేసుకుని అమీర్ ఖాన్ కోర్టు ధిక్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్టబోర్ 19న ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో…స్వలింగ సంపర్కుల జీవన విధానం, హక్కుల గురించి చర్చించారు. ఇలాంటి చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని న్యాయవాది తన పిటీషన్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment