ప్రియాంక చోప్రా చెల్లెలు మనారా నటించిన ''జిద్ '' చిత్ర ట్రైలర్ ఈనెల 29న రిలీజ్ అయ్యింది. హాట్ హాట్ గా ఉన్న ఈ ట్రైలర్ ని కేవలం ఆరు రోజుల్లోనే 18లక్షలకు పైగా జనాలు చూసారు. ట్రైలర్ నిండా అడల్ట్ కంటెంట్ ఫుల్లుగా ఉండటం తో యూట్యూబ్ లో క్లిక్ లమీద క్లిక్ లు కొడుతూ వీక్షకులు పిచ్చ పిచ్చగా చూస్తున్నారు. మనారా తో పాటు శ్రద్దా దాస్ కూడా రెచ్చిపోయి అందాలను అరబోయడమే కాకుండా కౌగిలింతలతో ,ముద్దులతో రెచ్చిపోయి కరణ్ వీర్ శర్మ తో రొమాన్స్ సాగించారు. యూట్యూబ్ లో వీక్షకుల మెప్పు పొందడంతో ప్రియాంక చెల్లి మనారా చాలా సంతోషంగా ఉంది. ''జిద్ '' సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్న ఈ భామ ఈ దెబ్బతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి అని భావిస్తోంది.
No comments:
Post a Comment