Friday, 31 October 2014

పవన్ కళ్యాణ్ తో మెహర్ రమేశ్.

                               


ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించాలని పట్టు పట్టాడు ఆ దర్శకుడు అందుకే పవన్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది . ఇంతకి ఆ దర్శకుడు ఎవరో తెలుసా మెహర్ రమేశ్. మెహర్ రమేశ్ దర్శకుడిగానే కాదు . అతను చిరంజీవికి దగ్గర బంధువు కూడా! పూరి జగన్నాథ్ దగ్గర అసోసియేట్ గా చేరకముందు మెగా కాంపౌండ్ లో చాలా కాలం పనిచేశాడు. ఆ సమయంలో, మెహర్ రమేశ్ కు దర్శకత్వం అవకాశం ఇస్తానని పవన్ కల్యాణ్ మాటిచ్చాడట!ఎప్పుడో ఇచ్చిన మాటతో పాటు బంధుత్వాన్ని ఉపయోగించుకుని పవన్ ను ఛాన్స్ ఇమ్మని మెహర్ చాలా కాలంగా అడుగుతున్నాడని తెలుస్తోంది.  దర్శకుడిగా మెహర్ రమేశ్ ఫెయిల్యూర్ వల్ల ‘శక్తి’, ‘షాడో’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి . దాంతో ఈ దర్శకుడికి సినిమా లేదు . మరి మెహర్ కు పవన్ ఎలా సమాధానం ఇస్తాడో చూడాలి ?

No comments:

Post a Comment