Friday, 31 October 2014

ముద్దుల వర్షం.


                                   


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సంతోషాన్ని ఆపుకోలేక దీపికా పై  ముద్దుల వర్షం కురిపించాడు. ఇక ఆ ముద్దుల గోల కి స్పందించిన హీరోయిన్ దీపికా పడుకొనే కూడా షారుఖ్ కి ముద్దులు పెట్టేస్తూ రెచ్చిపోయింది. ఈ సంఘటన చూసిన దర్శకురాలు ఫరా ఖాన్ కి కూడా మూడొచ్చింది ఇంకేముంది దీపికా తో కలిసి షారుఖ్ కి ఏకకా లంలో ఘాటు ముద్దులిచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. అంతేనా అక్కడే ఉన్న బొమన్ ఇరానీ ,సోనూ సుద్ లకు కూడా ముద్దులిచ్చి అందరూ కలిసి ముద్దుల వర్షం కురిపించారు. ఇదంతా పబ్లిగ్గా జరగడంతో ఇక ఫోటోగ్రాఫర్లకు పండగే పండగట ! దాంతో ఆ ముద్దుల వర్షాన్ని తమ కెమరా లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఈ ముద్దుల గోల కు కారణం ఏమిటంటే ఇటీవల షారుఖ్ ,దీపికా లు నటించిన ''హ్యాపీ న్యూ ఇయర్ '' చిత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తున్డటం తో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు . ఆ వేడుకలో ఇక షారుఖ్ ,దీపికా ,ఫరా ఖాన్ ,బొమన్ ఇరానీ ,సోనూ సుద్ లు ముద్దుల వర్షం కురిపించారు. 

No comments:

Post a Comment