Thursday, 30 October 2014

వెంకి తో సాహసం దర్శకుడు !

                                                                
                                                                                             
ఇటివలే ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లెజెండ్’లాంటి వరుస హిట్ చిత్రాలు  నిర్మించిన వారాహి సంస్థ  తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు . ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నిర్మాత సాయి కొర్రపాటి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి 12 నుంచి 17యేళ్లలోపు హీరోయిన్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాలో హీరో ఎవరా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజా వార్తలు ప్రకారం ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ చిత్రంలో నటించబోతున్నారనే వార్తలు అందుతున్నాయి. మరి వెంకటేష్ అయితే 12 నుంచి 17యేళ్లలోపు హీరోయిన్ ఎందుకు అన్నది అసలు ప్రశ్న ? ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


No comments:

Post a Comment