నటి కరీనాకపూర్ తనకు సర్వస్వమని సోదరి కరిష్మా కపూర్ పేర్కొంది. కరీనా తనకు సోదరిగా కంటే మంచి స్నేహితురాలని స్పష్టం చేసింది. 2012లో విడుదలైన ‘డేంజరస్ ఇష్క్’ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ 40 ఏళ్ల నటి మా ఇద్దరి మధ్య బంధం గట్టిదని తన మనసులో మాట చెప్పింది. ‘మేమిద్దరం అక్కా చెల్లెళ్లం. కరీనా ఓ కుటుంబ సభ్యురాలిగా కంటే గొప్ప స్నేహితురాలు. ఆమె నా జీవితంలో ఒక ఆశీర్వచనం’ అని కరిష్మా కపూర్ తెలిపింది. పది సంవత్సరాలపాటు ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాలీవుడ్‌లో విజయపరంపరను కొనసాగించడడం అరుదైన విషయమని ఈ ‘జుబేదా’ సినిమా నటి తెలిపింది.
'ఒకే ఫీల్డ్ లో విజయవంతంగా దశాబ్దంపాటు బాలీవుడ్‌లో పనిచేయడం గతంలో జరిగిన దాఖలాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలినని అనిపిస్తోంది. గొప్ప కెరీర్ దొరకడం మా అదృష్టమని అనుకుంటున్నా. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఉన్నప్పటికీ వృత్తిపరమైన నిర్ణయాల విషయంలో ఎవరిమీ జోక్యం చేసుకోలేదు’ అని కరిష్మా స్పష్టం చేసింది.
No comments:
Post a Comment