Sunday, 26 October 2014

అదేమీ యుద్ధం కాదు:దీపికా .

                                     




బాలీవుడ్ లో హీరోలకు-హీరోయిన్ లకు మధ్య చెలరేగుతున్న పారితోషికం వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనబడుటలేదు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి దీపికా పదుకునే గళం విప్పింది. పారితోషికం విషయంలో పురుషలతో పోల్చుకుంటే మహిళలకు చాలా తక్కువగానే ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. అయితే ఆ పారితోషికం అంశంపై తాము చేస్తున్నది యుద్ధం మాత్రం కాదని స్పష్టం చేసింది. బాలీవుడ్ లో విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. హీరోయిన్స్ కు అంతంగా  ప్రాముఖ్యత ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. దీనిపై తన సహచర నటీమణులంతా గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. 'మీ(పురుషుల) పారితోషికంతో పోల్చుకుంటే మా పారితోషికం తక్కువ. ఇది నిజం. గత రెండు సంవత్సరాల్లో పోల్చుకుంటే హీరోల పారితోషికంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాకు మాత్రం అలా జరుగలేదు. ఈ విషయంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా'అని దీపికా తెలిపింది. అయితే ఇదే యుద్ధం కాదని, తమకు కూడా పారితోషికం పెంచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. దీపికా నటించిన సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతున్నా.. అసలు బాక్సాఫీస్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేసుకోనని తెలిపింది.

No comments:

Post a Comment