Sunday, 26 October 2014

నిర్మాతగా సోనాక్షి..!

                              



వెండితెరపై రాణిస్తున్న సోనాక్షి సిన్హా త్వరలోనే నిర్మాతగా మారనుంది. సోదరులు లవ్, కుశ్‌లతో కలసి చిత్ర నిర్మాణం చేపట్టనుంది. ‘షాట్‌గన్’ శత్రుఘ్న సిన్హా వారసురాలిగా సోనాక్షి వెండితెరపై ఉనికి చాటుకుంటున్నా, ఆమె సోదరులు మాత్రం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేకపోయూరు. సినీరంగంతో అనుబంధం ఉన్నందున త్వరలోనే ‘క్రాటోస్ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సోనాక్షి భాగస్వామ్యం కూడా ఉంటుందని కుశ్ సిన్హా ట్విట్టర్‌లో వెల్లడించాడు.

No comments:

Post a Comment