ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతు క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత అప్పుడప్పుడు తన నోటిదురుసును ప్రదర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం . గతంలో మహేష్ బాబు ‘‘వన్’’ మూవీ, ‘‘ఆగడు’’ సినిమాల మీద వ్యంగ్యంగా సెటైర్లు వేసి అభిమానుల విమర్శలకు గురైన సమంత తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కేసింది. ఏజ్ బార్ హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకొని సెటిలైపోవడం బెటరని, 30 ఏళ్ళు వస్తే నేను కూడా పరిశ్రమ నుంచి తప్పుకుంటాను అంటూ ఈ అమ్మడు పేర్కొంది. దీంతో ఈ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మూడుపదుల వయస్సు దాటిన తారలు చాలామందే వున్నారు. యంగ్ హీరోయిన్లతో బాగానే పోటీ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అందులో ముఖ్యంగా అనుష్క ఒకరు! మూడుపదుల వయస్సు దాటినా కూడా తన గ్లామర్ ను ఇంకా పెంచుకుంటూపోతూ ‘‘రుద్రమదేవి, బాహుబలి’’ వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమాలతోపాటు తమిళ్‌లో రజనీకాంత్ సరసన ‘‘లింగా’’, అజిత్‌తో ‘‘తలా 55’’ అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు కొన్ని కథలను పెండింగ్ లో కూడా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు దాదాపు ఇంకా మూడేళ్లవరకు ఫుల్ బిజీగా వుండే అవకాశాలున్నాయి. ఈమెను దృష్టిలో పెట్టుకునే సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వరుసగా భారీ చిత్రాలు చేసుకుంటూపోతూ ఇతర హీరోయిన్లకు ఆప్షన్ ఇవ్వడంలేదనే అసూయతోనే సమంత ఈవిధంగా తన కోపాన్ని ఇలా అనుష్కపై కామెంట్ చేసి తీర్చుకుందని సినీవిశ్లేషకులు సైతం చెప్పుకుంటున్నారు.మరి ఈ విషయం పై అనుష్కా ఎలా స్పందిస్తుందో చూడాలి ?
Thursday, 30 October 2014
ఎవరిని సమంతా టార్గెట్ చేసింది.?

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment