లేటెస్ట్ గా మహేష్ బాబు తో నటించిన ఆగడు ఫ్లాప్ అవ్వడం తో పాటు అటు బాలీవుడ్ లో కూడా తను నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. దాంతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉంది మిల్కీ బ్యూటి తమన్నా ? ప్రస్తుతం బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తోందే తప్ప మిగతా సినిమాలేవీ లేవు . అందుకే ఈ అమ్మడు సినిమా అవకాశాలకోసం సౌత్ చిత్రపరిశ్రమలో బాగానే చక్కర్లు కొడుతోందని సమాచారం! వరుస ఫ్లాపుల కారణంగా స్టార్ డమ్ ను కోల్పోయిన ఈ బ్యూటీ తిరిగి తన స్టార్ డమ్ ను సంపాదించుకోవడం కోసం నానాతంటాలు పడుతోందని సమాచారం . ఈ నేపథ్యంలో ఈ అమ్మడు ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి? ఇంతకి ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే అక్కినేని నాగార్జున - తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్లాన్ లో వున్నారని, అయితే ఇందులో హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోవడం వల్లే ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. మల్టీస్టారర్ కావడం వల్ల నిన్నమొన్నటివరకు ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారని అనుకున్నారు కానీ.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం ఒకే హీరోయిన్ వుంటుందని సమాచారం! ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందిని విశ్లేషించిన అనంతరం చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్నారని యూనిట్ వర్గాల సమాచారం! సో ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేయడానికి ఈ భామా ఓకే అందట !
Thursday, 30 October 2014
ఇద్దరు హీరోలతో తమన్నా రోమాన్స్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment